Breaking News
  • దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై మహిళా సంఘాల అభ్యంతరం. ఎన్‌కౌంటర్‌కు వ్యతిరేకంగా హైకోర్టుకు లేఖ రాసిన మహిళా సంఘాలు. కస్టడీలో ఉన్న నిందితులను ఎలా ఎన్‌కౌంటర్‌ చేస్తారని లేఖ. కోర్టులో కేసు నడుస్తుండగా చట్టాన్ని ఎలా చేతుల్లోకి తీసుకుంటారు. ఎన్‌కౌంటర్‌ చేసిన వారిపై చర్యలు తీసుకునేలా డీజీపీని ఆదేశించాలి. మృత దేహాలకు ఫోరెన్సిక్‌ నిపుణులతో పోస్టుమార్టం చేయించాలి. పోస్టుమార్టం వీడియో తీయించాలి-లేఖలో మహిళా సంఘాలు. హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అందుబాటులో లేకపోవడంతో సోమవారం విచారిస్తామన్న హైకోర్టు.
  • కేంద్రీయ సైనిక్‌ బోర్డ్‌కు పవన్‌కల్యాణ్‌ విరాళం. కోటి రూపాయలు విరాళం ప్రకటించిన పవన్‌కల్యాణ్‌. స్వయంగా ఢిల్లీ వెళ్లి డీడీ అందిస్తా-పవన్‌కల్యాణ్‌.
  • ఎన్‌కౌంటర్లు సమస్యకు పరిష్కారం కాదు-ట్విట్టర్‌లో ఆర్జీవీ. సమాజంలో ఉద్రేకాలను తగ్గించేందుకు ఎన్‌కౌంటర్లు దోహదం చేయొచ్చు-ట్విట్టర్‌లో రామ్‌గోపాల్‌వర్మ.
  • తూ.గో: ఆంధ్రా పాలిటెక్నిక్‌ కాలేజ్‌లో విద్యార్థులపై దాడి. విద్యార్థులపై దాడి చేసిన బయటి వ్యక్తులు. ఇద్దరు విద్యార్థులకు గాయాలు పోలీసులకు ఫిర్యాదు, కేసు నమోదు.
  • గుంటూరు: పిడుగురాళ్ల సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు. లెక్కలు చూపని రూ.56,700 స్వాధీనం, కేసు నమోదు.
  • ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైంది-చంద్రబాబు ట్వీట్‌. ఉల్లి ధరలతో జనం అల్లాడుతుంటే దేశమంతా ధరలు పెరిగాయని వైసీపీ మంత్రులు చెప్పడం హాస్యాస్పదం-ట్విట్టర్‌లో చంద్రబాబు. ఆరు నెలల్లోనే రాష్ట్రాన్ని దళారుల రాజ్యంగా మార్చారు. ఒక్క ఉల్లి మాత్రమే కాదు.. నిత్యావసరాల ధరలన్నీ చుక్కలనంటాయి. రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అన్నారు.. ఏమైంది. ఉల్లి కోస్తే వచ్చే కన్నీళ్లు.. ఉల్లిని కొంటున్నప్పుడే వస్తున్నాయి. ఉల్లి ధరల తడాఖా ఏంటో స్థానిక సంస్థల్లో మహిళలు చూపిస్తారు -ట్విట్టర్‌లో చంద్రబాబు
  • మహబూబ్‌నగర్‌: దిశ నిందితుల మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తి. రాత్రికి మహబూబ్‌నగర్‌ ప్రభుత్వాస్పత్రిలోనే నిందితుల మృతదేహాలు. రేపు మహబూబ్‌నగర్ ఆస్పత్రికి వెళ్లనున్న ఎన్‌హెచ్ఆర్సీ ప్రతినిధులు. ఎన్‌హెచ్‌ఆర్సీ ప్రతినిధుల బృందం పరిశీలించిన తర్వాతే నిందితుల మృతదేహాలకు అంత్యక్రియలు. మహబూబ్‌నగర్‌ ప్రభుత్వాస్పత్రి దగ్గర భారీగా పోలీస్‌ బందోబస్తు.

అమెరికాలో తెలుగోళ్ళకు జైలు శిక్ష.. ఏం చేశారంటే ?

imprisonment for telugu students, అమెరికాలో తెలుగోళ్ళకు జైలు శిక్ష.. ఏం చేశారంటే ?

ఫార్మింగ్టన్ యూనివర్సిటీ కేసులో ఆరుగురు తెలుగువారికి జైలు శిక్ష పడింది. మరో ఇద్దరికి త్వరలో శిక్ష ఖరారు కానుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికాలో సంచలనం సృష్టించిన యూనివర్సిటీ ఆఫ్ ఫార్మింగ్టన్ కుంభకోణం వ్యవహారంలో ఈ ఆరుగురు భారతీయులకు ఫెడరల్ కోర్టు జైలు శిక్ష విధించింది. అమెరికాలో సంచలం సృష్టించిన ఫార్మింగ్టన్‌ నకిలీ యూనివర్సిటీ కేసులో తెలుగు విద్యార్థులకు శిక్షలు ఖరారు చేసింది ఫెడరల్‌ న్యాయస్థానం.

విదేశీ విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన అంతర్జాతీయ విద్యార్థి వీసా పథకం దుర్వినియోగం అవుతోందని గుర్తించిన అమెరికా హోంలాండ్‌ సెక్యూరిటీ విభాగానికి చెందిన ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌-ఐసీఈ అధికారులు. ‘పేపర్‌ చేజ్‌’ పేరుతో ఒక రహస్య ఆపరేషన్‌ ప్రారంభించారు. ఇందులో భాగంగా మిచిగన్‌ రాష్ట్రంలోని ఫార్మింగ్టన్‌లో 2015లో నకిలీ యూనివర్సిటీని స్థాపించారు. దీనికి ‘యూనివర్సిటీ ఆఫ్ ఫార్మింగ్టన్’అని పేరు పెట్టారు.

కాగితాలపైనే కనిపించే ఫార్మింగ్టన్ యూనివర్సిటీలో ఎలాంటి సిబ్బందీ, అధ్యాపకులూ లేరు.. తరగతులు కూడా ఉండవు. అమెరికాలో అక్రమంగా నివసించాలనుకునే విద్యార్ధులుగా చేర్చుకుని ఇమ్మిగ్రేషన్ కుంభకోణాలకు పాల్పడేవారిని పట్టుకోవడమే ఈ ఆపరేషన్ లక్ష్యం. ఈ యూనివర్సిటీ నకిలీదని తెలియని ఎందరో విద్యార్థులు దళారుల ద్వారా అందులో చేరారు. అక్రమ వీసాలపై అడ్మిషన్లు తీసుకోవడంతో పాటు అమెరికాలో ఉద్యోగాలు కూడా చేసుకుంటున్న వీరందరినీ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు అరెస్టు చేశారు.

ఫార్మింగ్టన్ యూనివర్సిటీలో చేరిన 145 మంది విద్యార్థులను తిరిగి స్వదేశానికి పంపేసిన అధికారులు, ఎనిమిది మంది దళారులను అదుపులోకి తీసుకొని విచారణ జరిపారు. ఈ దళారులంతా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారే కావడంతో కలకలం చెలరేగింది. తాజాగా వీరిలో ఆరుగురికి శిక్షలు విధించింది ఫెడరల్‌ న్యాయస్థానం. ఇందులో సామ సంతోష్‌కు 14 నెలల జైలు శిక్ష పడింది. భరత్‌ కాకిరెడ్డి, సురేశ్‌ కందలకు 18 నెలలు, అవినాశ్‌ తక్కళ్లపల్లికి 15 నెలలు. అశ్వంత్‌ నూనె, ప్రత్తిపాటి నవీన్‌లకు 12 నెలల చెప్పున జైలు శిక్షలు పడ్డాయి. రాంపీస ప్రేమ్‌, కర్ణాటి ఫణిదీప్‌లకు త్వరలో శిక్షలు ఖరారు కానున్నాయి.