Breaking News
  • అమరావతి: సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.112 కోట్లను కొట్టేసే కుట్ర అంశంపై తుళ్లూరు‌ పిఎస్ లో కేసు నమోదు.‌ విచారణ జరపాలంటూ రెవిన్యూ అసిస్టెంట్ సెక్రటరీ మురళికృష్ణారావు పిర్యాదు.. ఫేక్ చెక్కుల వివరాలు : 1) 52,65 కోట్లు, చెక్ నెంబర్ : 694499. 2) 39,85 కోట్లు చెక్ నెం : 792896 . 3) 24,65 కోట్ల చెక్ నెంబర్ : 792839. ఈ మూడు ఫేక్ చెక్కుల వివరాలను తుళ్లూరు పోలీసులకు అందించిన రెవిన్యూ అసిస్టెంట్ కార్యదర్శి మురళికృష్ణారావు.‌ ఫేక్ చెక్ లపై విచారణ చేస్తున్నామన్న తుళ్లూరు సీఐ ధర్మేంధ్రబాబు. చెక్ ఎన్ క్యాష్ కాకపోయినా పిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ చేసి విచారణ చేస్తున్నాం : తుళ్లూరు సీఐ ధర్మేంద్రబాబు.
  • తిరుమల లో విమానం వెళ్లిన మాట వాస్తవమేనని ప్రకటించిన ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ సురేష్. విమానయాన శాఖ కు చెందిన నావిగేషన్ సర్వే విమానం తిరుమల మీదుగా వెళ్ళింది. అయితే..తిరుమల శ్రీవారి ఆలయం మీదుగా విమానం వెళ్ళలేదు. ఆలయానికి కొద్దిగా దూరం నుంచి ప్రయాణించింది.. తిరుమల పై విమాన రాకపోకలకు ఎలాంటి ఆంక్షలు లేవు. నో ఫ్లై జోన్ గా ప్రకటించలేమని గతంలో కేంద్రం స్పష్టం చేసింది. అయినప్పటికీ అనధికారికంగా తిరుమల నో ఫ్లై జోన్ గా కొనసాగుతోంది...ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ సురేష్.
  • అమరావతి ట్విటర్ లో పవన్ కళ్యాణ్. అమరావతి రైతుల పక్షాన ఏపీ హైకోర్టు లో అఫిడవేట్ దాఖలు చేయనున్న జనసేన. ఈ బాధ్యతలను జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ తమ్మి రెడ్డి శివశంకర్ కు అప్పగింత.
  • రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు నేతృత్వంలో ఉపరాష్ట్రపతి నివాసంలో ఉన్నతస్థాయి సమావేశం. హాజరైన డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్, పార్లమెంట్ వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్. పార్లమెంట్ సమావేశాల కుదింపు, రాజ్యసభలో వ్యవసాయ సంబంధ బిల్లుల ఆమోదం సందర్భంగా జరిగిన ఆందోనలుపై చర్చ జరిగే అవకాశం.
  • కాంగ్రెస్ పార్టీపై విజయసాయి రెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించిన రాజ్యసభ. రైతు బిల్లులపై చర్చలో భాగంగా కాంగ్రెస్ పార్టీని విమర్శించిన విజయసాయి రెడ్డి. కాంగ్రెస్‌ను దళారుల పార్టీగా అభివర్ణించిన విజయసాయి రెడ్డి. విజయసాయి మాటలపై అభ్యంతరం, ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్. కొద్దిసేపు రభసకు దారితీసిన విజయసాయిరెడ్డి విమర్శలు. రికార్డులను ఆ విమర్శలను తొలగించాలని రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు నిర్ణయం.
  • ప.గో: ద్వారకాతిరుమలలో ఏపీలోని 13 జిల్లాల కాపు జేఏసీ నేతల సమావేశం. రేపు కిర్లంపూడిలో ముద్రగడను కలిసి రాష్ట్ర కాపు జేఏసీకి నాయకత్వం వహించాలని కోరనున్న కాపునేతలు. కాపు జేఏసీ ముద్రగడ నాయకత్వంలోనే ముందుకు వెలుతుంది, ఆయనే మా నాయకుడు. రాష్ట్రంలో ఎన్ని కాపు సంఘాలు ఉన్న వాటి ముఖ్య ఉద్దేశం రిజర్వేషన్ సంకల్పం. కాపు సంక్షేమం, అభివృద్ధి కోసం ఎవరు పాటుపడినా కాపు జేఏసీ స్వాగతిస్తుంది. రాష్ట్రం గర్వపడే ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం. ముద్రగడ నాయకత్వంలోనే రిజర్వేషన్ సాధ్యమవుతాయని కాపు జేఏసీ నేతల తీర్మానం.
  • నా 60 సంవత్సరాల రాజకీయ అనుభవంలో నిబంధనలకు వ్యతిరేకంగా ఎప్పుడూ బిల్లుల ఆమోదం జరగలేదు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ప్రభుత్వానికి పూర్తి పక్షపాతంగా వ్యవహరించారు. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన సవరణలకు, స్టాట్యుటరీ తీర్మానాలను డిప్యూటీ చైర్మన్ నిబంధనలకు వ్యతిరేకంగా తోసిపుచ్చారు. రాజ్యాంగానికి, నిబంధనలకు వ్యతిరేకంగా అధికారపక్షం వ్యవహరించినందుకు మా నిరసన సభలోనే తెలియజేసాము. డిప్యూటీ చైర్మన్ వ్యవహారశైలిని నిరసిస్తూ అవిశ్వాస తీర్మానం నోటీసులిచ్చాము. 12 పార్టీల మద్దతుతో 50 మంది ఎంపీల సంతకాలతో డిప్యూటీ చైర్మన్ కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చాము. డిప్యూటీ చైర్మన్ కి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం నోటీసులు పెండిగులో ఉండగా ఆయన సభ అధ్యక్షుడి హోదాలో కొనసాగే అవకాశం లేదు. కే. కేశవరావు, టీఆరెస్ పార్లమెంటరీ పార్టీ నేత.

అమీర్ పేట్ టూ హైటెక్ సిటీ: ప్రతి 4 నిమిషాలకు ఒక మెట్రో..

Ameerpet To Hitech Ciry Metro Train Service Per Every 4 Minutes, అమీర్ పేట్ టూ హైటెక్ సిటీ: ప్రతి 4 నిమిషాలకు ఒక మెట్రో..

మెట్రో ప్రయాణికులకు ఆ సంస్థ అధికారులు మరో గుడ్ న్యూస్ తెలిపారు. హైటెక్ సిటీ నుంచి జూబ్లీ చెక్‌పోస్టు వరకు రివర్సల్ సిస్టమ్‌ను మెట్రో అధికారులు అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటికే అమీర్ పేట్ నుంచి హైటెక్ సిటీ వరకు మెట్రో రైలు సేవలందిస్తోంది. ఇప్పటివరకూ జూబ్లీ చెక్ పోస్టు నుంచి హైటెక్ సిటీ వరకు సింగిల్ లైన్ ద్వారా రైళ్లు నడిపింది మెట్రో. రివర్సల్ సిస్టమ్ కూడా అందుబాటులోకి రావడంతో ఇకపై అమీర్ పేట నుంచి హైటెక్ సిటీ వరకు ప్రతి 4 నిమిషాలకు ఒక మెట్రో రైలు అందుబాబులో ఉండనుంది. ఇక ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ వరకు ప్రతి 5 నిమిషాలకు ఒక మెట్రో రైలు నడవనుంది. హైటెక్ సిటీ నుంచి అమీర్ పేట వరకు 4 వారాల పాటు ప్రతి నాలుగు నిమిషాలకు ఒక మెట్రో అందుబాటులో ఉండనుంది. తరువాత పరిస్థితులను బట్టి సమయాన్ని మరింతగా తగ్గించి ప్రతి మూడు నిమిషాలకు ఒకసారి ఒక మెట్రో రైలును అందుబాటులో ఉంచుతామని మెట్రో అధికారులు తెలిపారు.

Related Tags