కట్టుకున్న ఇల్లాలు కాలిపోతున్న పట్టించుకోని భర్త.. వీడియో తీసి అత్తామామాలకు పంపాడు..!

రాను రాను మనషుల్లో మానవత్వం మంటగలుస్తోంది. సాటి మనిషి ఆపదలో ఉంటే సాయం చేయాలన్న ఆలోచననే రాకుండపోతోంది. ఏకంగా భర్త కళ్ల ముందు భార్య కాలిబూడిదవుతుంటే.. సెల్ ఫోన్ తీసుకుని వీడియో షూట్ చేశాడు తప్ప.. రక్షించేందుకు ప్రయత్నించలేదు.

  • Balaraju Goud
  • Publish Date - 6:47 pm, Fri, 27 November 20

రాను రాను మనషుల్లో మానవత్వం మంటగలుస్తోంది. సాటి మనిషి ఆపదలో ఉంటే సాయం చేయాలన్న ఆలోచననే రాకుండపోతోంది. ఏకంగా భర్త కళ్ల ముందు భార్య కాలిబూడిదవుతుంటే.. సెల్ ఫోన్ తీసుకుని వీడియో షూట్ చేశాడు తప్ప.. రక్షించేందుకు ప్రయత్నించలేదు. ఈ దారుణ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అత్తింట్లో వేధింపులు తట్టుకోలేక నిప్పు అంటించుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది ఓ ఇల్లాలు. ఆ దారుణాన్ని ఫోన్‌లో చిత్రీకరించి ఆమె కుటుంబ సభ్యులకు పంపించాడు ఆ రాక్షసుడు. ఝుంఝును జిల్లాకు చెందిన ఓ వివాహిత ఈ నెల 20న ఆత్మహత్య చేసుకోవడానికి నిప్పు అంటించుకుంది. ఒంటి నిండా మంటలు అంటుకుని బాధను ఓర్చుకోలేక తల్లడిల్లిపోయింది. అక్కడే ఉన్న భర్త కాపాడేందుకు ఏమాత్రం ప్రయత్నం చేయకపోగా, ఆ దృశ్యాన్ని సెల్ ఫోన్‌లో చిత్రీకరించాడు. ఆ తర్వాత దాన్ని ఆమె తల్లిదండ్రులకు పంపాడు. ఇరుగుపొరుగు వారు ఘటనాస్థలానికి చేరుకుని ఆమెను జైపూర్ లోని ఆస్పత్రికి తరలించారు. పూర్తిగా కాలిన గాయాలతో ఉన్న ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈనెల 22న మృతి చెందింది. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.