నిబంధనలు పాటించని కుమరన్‌ సిల్క్స్‌ మూసివేత!

పండుగల వేళ అప్రమత్తతో వ్యవహరించండని ప్రధానమంత్రి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు చెబుతూనే ఉన్నా కొందరు మాత్రం చెవికెక్కించుకోవడం లేదు.. పండుగంటే సరదానే, పండుగంటే సంబరమే కానీ కరోనా వైరస్‌ను కూడా దృష్టిలో పెట్టుకోవాలన్నదే...

నిబంధనలు పాటించని కుమరన్‌ సిల్క్స్‌ మూసివేత!
Follow us

|

Updated on: Oct 21, 2020 | 12:40 PM

పండుగల వేళ అప్రమత్తతో వ్యవహరించండని ప్రధానమంత్రి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు చెబుతూనే ఉన్నా కొందరు మాత్రం చెవికెక్కించుకోవడం లేదు.. పండుగంటే సరదానే, పండుగంటే సంబరమే కానీ కరోనా వైరస్‌ను కూడా దృష్టిలో పెట్టుకోవాలన్నదే పెద్దల హితవు.. అయితే ప్రజలు మాత్రం కోవిడ్‌-19 నిబంధనలను ఏ మాత్రం పాటించకుండా షాపింగ్‌లు చేస్తున్నారు..చెన్నైలో కుమరన్‌ సిల్క్స్‌ అనే ప్రసిద్ధ షో రూమ్‌ ఉంది.. పండగల సీజన్‌ కాబట్టి షాపింగ్‌ కోసం జనం భారీ ఎత్తున వచ్చారు.. షోరూమ్‌ వెలుపల, లోపల ఎలాంటి భౌతిక దూరాన్ని పాటించలేదు సరికదా మూతికి మాస్కులు కూడా పెట్టుకోలేదు.. ఇదంతా గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌కు తెలిసింది.. వెంటనే కోవిడ్‌-19 నిబంధనలను ఉల్లంఘించినందుకు కుమరన్‌ సిల్క్స్‌ను మూసేశారు కార్పొరేషన్‌ అధికారులు.. ప్రజలు భద్రతా ప్రోటోకాల్‌ను ఖచ్చితంగా పాటించాలని గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ ఒక ట్వీట్‌లో పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘించడం చాలా ప్రమాదకరమని, బాధాకరమని జీసీసీ కమిషనర్ అన్నారు.. అయితే ఇలాంటి ఉల్లంఘనలు ప్రతి షాపింగ్‌ మాల్‌లోనూ జరుగుతున్నాయని, కేవలం కుమరన్‌ సిల్క్స్‌నే ఎందుకు టార్గెట్ చేశారంటున్నారు కొందరు. పండుగలప్పుడు షాపింగ్‌లు చేయకుండా ఇంట్లో ఉంటారా అని ప్రశ్నిస్తున్నారు.