ప్రస్తుత సాంకేతిక ప్రపంచంలో.. రోజుకో కొత్త వస్తువు మార్కెట్లోకి అందుబాటులోకి వస్తున్నాయి. ఇక కంప్యూటర్లు, ల్యాప్ టాప్స్, మొబైల్స్ గురించి చెప్పాల్సిన పనే లేదు. ఎందుకంటే.. ఎన్నో రకాల బ్రాండ్స్.. వినియోగదారులను ఆకర్షించడం కోసం కొత్త కొత్త డిజైన్లలో ఇన్ని రకాల ఉత్పత్తులను అందిస్తున్నాయి. మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది స్మార్ట్ ఫోన్స్, మార్కెట్లో ఎన్నో రకాల న్యూమోడల్ స్మార్ట్ ఫోన్స్ అందుబాటులో ఉన్నాయి. ఒక స్మార్ట్ ఫోన్ తీసుకున్న నెలలోపే… అదే బ్రాండ్ మరో కొత్త డిజైన్ అందుబాటులోకి తీసుకువస్తుంది. దీంతో మన దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్ పాతది అయినట్టుగా భావిస్తున్నారు చాలా మంది. ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్లను అమ్మడం.. మళ్లీ కొత్త ఫోన్లను కొనడం చాలా ఎక్కువగా చేస్తున్నారు. అయితే కాస్తా టెక్ అనుభవం ఉన్నవారు తమ ఫోన్లను మంచి ధరకే అమ్ముకుంటున్నారు. మరీ మిగతా వారి సంగతి ఏంటి ? . చాలా మంది తమ ఫోన్లను మంచి ధరకు అమ్మాలని చూసిన ఫలితం లేకుండాపోతుంది. దీంతో కొంచెం ధరకే వాటిని అమ్మేస్తుంటారు. అలాంటి వారి కోసం కొన్ని రకాల వెబ్ సైట్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో మీ స్మార్ట్ ఫోన్కు మంచి ధరను అందిస్తాయి. మరీ అవెంటో తెలుసుకుందామా.
క్యాషిఫై.. అనేది పాత లేదా ఉపయోగించిన మొబైల్ ఫోన్లను అమ్మటానికి చాలా ప్రసిద్ధి చెందిన వెబ్ సైట్. ఇందులో మీ పాత ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను అమ్మడం ద్వారా మరింత డబ్బు సంపాదించుకునే వీలుంటుంది. ఇందులో కేవలం ఫోన్లు మాత్రమే కాకుండా.. టీవీలు, ల్యాప్ టాప్లు, ఐమాక్స్, గేమింగ్ కన్సోల్లను కూడా అమ్మవచ్చు.
కర్మ రీసైక్లింగ్ అనేది ఇటీవల కాలంలో పాత స్మార్ట్ ఫోన్లను అమ్మడానికి బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఇది ఇప్పుటివరకు ఎన్నో ఎలక్ట్రానిక్ గ్యా్డ్జెట్లను అమ్మినందుకు మంచి రికార్డ్ ఉంది. అత్యంత ఖరీదైన గ్యాడ్జెట్లను కూడా ఇందులో నిమిషాల్లో అమ్మవచ్చు.
www.yaantra.com ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను క్షణాల్లో అమ్మవచ్చు. ఇందులో మీరు ఉపయోగించే గ్యాడ్జెట్లకు ఇతర వెబ్ సైట్లతో పోలీస్తే… మంచి ధర ఉంటుంది. అలాగే ఇందులో మీ పాత స్మార్ట్ ఫోన్ను క్షణాల్లో అమ్మవచ్చు.
గెట్ ఇన్ స్టా క్యాష్ పాత్ గ్యాడ్జెట్లను అమ్మడానికి మంచి ఆప్షన్. ఇందులో స్మార్ట్ ఫోన్ అమ్మాలనుకుంటే.. ముందుగా మీరు https://getinstacash.in/ కు లాగిన్ అయి మీ వివరాలను నమోదు చేయాలి. ఆ తరువాత కంపెనీ ఉద్యోగులు ఇంటికి వచ్చి మీ నుంచి గాడ్జెట్లను సేకరిస్తారు. ఇందులో మీ పేరు చేప్పగానే.. వెంటనే ఇన్ స్టా క్యాష్ డబ్బు అందుతుంది.
Also Read: Summer Health Tips: వేసవిలో కుండ నీళ్ళు తాగడం వలన ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..