
వాషింగ్ మెషీన్‌ను శుభ్రం చేసే ముందు కచ్చితంగా వాషింగ్ మెషీన్ మాన్యువల్ చదవాలి. వాషింగ్ మెషీన్ పనితీరు కంపెనీకు అనుగుణంగా మారుతుంది కాబట్టి మాన్యువల్ చదివితే వాషింగ్ మెషీన్ భాగాలపై అవగాహన వస్తుంది. అలాగే యూజర్ మాన్యువల్‌లో వాషింగ్ మెషీన్‌ను శుభ్రం చేసే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలను కూడా పొందుపరుస్తారు.

వాషింగ్ పూర్తయ్యాక కచ్చితంగా వాషింగ్ మెషీన్ డోర్‌ను తెరిచి ఉంచాలి. ఇలా చేయడం ద్వారా వాషింగ్ మెషీన్‌లోకి గాలి ప్రసరణ సక్రమంగా జరిగుతుంది. అలాగే డ్రమ్ లోపు ఫంగస్ పెరుగుదలను నివారిస్తుంది. పైగా వాషింగ్ వల్ల ఏర్పడిన తేమను వేగంగా తగ్గిస్తుంది.

వాషింగ్ మెషీన్‌లో మన బట్టలను ఉతకడంలో కీలకపాత్రను పోషించేంది డ్రమ్. ఇందులోనే మాసిన బట్టలను వేస్తూ ఉంటాయి. అయితే వాషింగ్ మెషీన్ డ్రమ్‌ను క్లీన్ చేయడానికి హాట్ వాటర్ మోడల్‌లో పెట్టి కొంత మొత్తంలో వెనిగర్ వేసి వాషింగ్ మోడ్‌లో పెట్టడం ద్వారా డ్రమ్ క్లీన్ అవుతుంది.

చాలా వాషింగ్ మెషీన్స్‌లో మెత్తని పదార్థాలతో పాటు నాణేలను ట్రాప్ చేయడానికి ఫిల్టర్ ఉంటుంది. సాధారణంగా వాషింగ్ మెషీన్ ఫిల్టర్లు ముందు భాగంలో ఫిల్టర్లు ఉంటాయి. అందువల్ల క్లీన్ చేసే సమయంలో ఫిల్టర్‌ను తనిఖీ చేసి అందులో చేరిన వేస్ట్ మెటీరియల్‌ను తీసేయాలి. అయితే ఫిల్టర్ క్లీన్ చేయాలంటే యూజర్ మాన్యువల్ ప్రకారం చేయడం ఉత్తమం.

వాషింగ్ మెషీన్ బయటి భాగాన్ని కూడా శుభ్రం చేయడం చాలా ముఖ్యం. అయితే ఇలా శుభ్రం చేసే సమయంలో ఆల్‌పర్పస్ క్లీనర్‌తో మృదువైన గుడ్డను ఉపయోగించి యంత్రాన్ని తుడిచివేయాలి. ఇలా చేయడం ద్వారా ధూళి లేదా అవశేషాలను తొలగించడం సులభం అవుతుంది.