Interesting Story: పురుషులే ఇలా.. ఈ ఫోటో వెనుక అర్థం వేరు, పరమార్థం వేరు.. స్టోరీ చదివితే ఆ వ్యక్తులకు హ్యాట్సాఫ్ చెబుతారు

|

Apr 14, 2021 | 1:34 PM

అమ్మ, అక్క, ఆళి, సోదరి.. ఇలా మహిళ లేకుంటే ఈ ప్రపంచానికి మనుగడ లేదు. మరొకరికి జన్మనిచ్చే అరుదైన, అద్భుతమైన అవకాశాన్ని ప్రకృతి స్త్రీకి ఇచ్చింది.

Interesting Story: పురుషులే ఇలా.. ఈ ఫోటో వెనుక అర్థం వేరు, పరమార్థం వేరు.. స్టోరీ చదివితే ఆ వ్యక్తులకు హ్యాట్సాఫ్ చెబుతారు
apanese-leaders-wearing-heavy-jacket
Follow us on

అమ్మ, అక్క, ఆళి, సోదరి.. ఇలా మహిళ లేకుంటే ఈ ప్రపంచానికి మనుగడ లేదు. మరొకరికి జన్మనిచ్చే అరుదైన, అద్భుతమైన అవకాశాన్ని ప్రకృతి స్త్రీకి ఇచ్చింది. ఒక్కసారి ఊహించండి.. స్త్రీ లేకపోతే ఈ ప్రపంచం ఏమైపోతుందో. ఒక్కసారిగా ప్రపంచం ఆగిపోయినట్లు అనిపిస్తుంది కదా. యస్.. ప్రతి పురుషుడు మదిలో, మైండ్‌లో పెట్టుకోవాల్సిన అంశం ఒకటి ఉంది. ఈ రోజు నువ్వు ఒక కొడుకుగా ఉన్నా, రేపు మరో బిడ్డకు జన్మనివ్వాలన్నా కావాల్సింది స్త్రీనే. కాబట్టి అందమైన ఆడజాతికి అగ్రతాంబూలం ఇస్తూ ముందకు సాగుదాం. వారు గౌరవాన్ని కాపాడుతూ.. రుణం తీర్చుకుందాం.

కాగా గర్భధారణ సమయంలో మహిళలు ఎదుర్కునే సమస్యలు అన్నీ, ఇన్నీ కావు. ఈ సమస్యలు, బాధలు మరొక స్త్రీకి మాత్రమే తెలుస్తాయి. అయితే జపాన్‌లో చాలా మంది మగ నాయకులు గర్భిణీ స్త్రీలలా తిరుగుతున్నారు. అవును, జపాన్‌కు చెందిన ముగ్గురు అగ్ర నాయకులు గర్భిణీ స్త్రీలుగా కనిపించేలా జాకెట్లు ధరించి తిరగడం చాలామందిని గందరగోళానికి గురిచేసింది. ఈ లీడర్స్ ఎల్లప్పుడూ 7.5 కిలోల జాకెట్లు ధరించి తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. భారీ జాకెట్ ధరించడం వల్ల వారి లుక్ గర్భవతి మాదిరిగా కనిపిస్తుంది. ఈ లుక్‌లో ఉన్న ఈ నాయకుల ఫోటోలు  సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. కానీ దీని వెనుక చాలా ఇంట్రస్టింగ్ స్టోరీ ఉంది.

నాయకులు ఈ విధంగా చేయడం ద్వారా గర్భం మోస్తున్న సమయంలో మహిళలు పడే కష్టాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తకాకో సుజుకి అనే  మహిళా నేత ఈ ప్రయోగానికి నాంది పలికారు. దీని ద్వారా, ప్రెగ్నెంట్‌గా ఉన్న సమయంలో మహిళలు ఎదుర్కునే సమస్యలు, సవాళ్లను పురుషులకు వివరించాలని ఆమె కోరుకుంటుంది. వాస్తవానికి, చాలా దేశాల మాదిరిగానే, జపాన్‌లో కూడా గర్భిణీ స్త్రీలకు  కార్యాలయాల్లో ప్రత్యేక సదుపాయాలు ఉండవు. దీంతో ప్రెగ్నెంట్స్ చాలా సమస్యలను ఎదుర్కొంటారు. అందుకే ఆమె ఈ తరహా విధానంతో గర్భం మోస్తున్నప్పుడు మహిళలు ఎదుర్కునే ఇబ్బందులను ప్రపంచానికి ఎత్తిచూపాలని భావించింది.

Also Read: ఈ చెట్లు, మొక్కలు చాలా ప్రమాదకరమైనవి… టచ్ చేసినా చాలు ప్రాణాలు తీసేస్తాయి..

కర్నూలు జిల్లాలో వినూత్న ఆచారం.. పిడకలతో ఇరు వర్గాల సమరం.. ఇంట్రస్టింగ్ స్టోరీ