ఆకలేసి బర్గర్ తినాలనుకుంది.. తీరా పార్శిల్ ఓపెన్ చేశాక అంతకుమించిన దృశ్యం కనిపించింది..

తీరిగ్గా కూర్చుని బర్గర్ తినదామని పార్శిల్ ఓపెన్ చేసి.. బర్గర్‌ను కొరికేటప్పటికీ.. ఆమెకు అంతకుమించిన దృశ్యం కనిపించింది.

ఆకలేసి బర్గర్ తినాలనుకుంది.. తీరా పార్శిల్ ఓపెన్ చేశాక అంతకుమించిన దృశ్యం కనిపించింది..
Burger King

Updated on: Oct 08, 2022 | 1:20 PM

ఓ మహిళకు ఆకలేయడంతో బర్గర్ తినాలనుకుంది. దీంతో దారిలో ఉన్న ‘బర్గర్ కింగ్’‌ దగ్గర ఆగింది. అక్కడ ఆమె Chicken Burger Meal ఆర్డర్ పెట్టింది. ఇక తీరిగ్గా కూర్చుని దాన్ని తినదామని పార్శిల్ ఓపెన్ చేసి.. బర్గర్‌ను కొరికేటప్పటికీ.. ఆమెకు అంతకుమించిన దృశ్యం కనిపించింది. ఇంతకీ ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం..

వివరాల్లోకి వెళ్తే.. ఇంగ్లాండ్‌కు చెందిన లెన్నే డాలీ అనే మహిళ స్థానికంగా ఉండే ‘బర్గర్ కింగ్’ రెస్టారెంట్‌లో Chicken Burger Meal ఆర్డర్ పెట్టింది. దాన్ని తీరిగ్గా తినదామని కూర్చుని పార్శిల్ ఓపెన్ చేసింది. బర్గర్‌ను ఒక బైట్ చేసేసరికి ఆమెకు అంతకుమించిన దృశ్యం కనిపించింది. బర్గర్ మధ్యలో ఓ చెక్క పెన్సిల్(ఐ లైనర్) ఉండటం చూసి ఆమె ఒక్కసారిగా షాక్ అయింది.

దీంతో ఆమె వెంటనే బర్గర్ కింగ్ రెస్టారెంట్‌కు ఫోన్ చేసి.. జరిగిన విషయాన్ని తెలియజేసింది. అక్కడున్న సిబ్బంది ఒకరు సదరు మహిళతో ఆ పెన్సిల్.. ఐలైనర్ కాదని.. బర్గర్ వ్రాపర్స్‌పై రాసే పెన్సిల్ అని స్పష్టం చేసిందట. అయితే ఆమె ఈ ఘటనపై సరిగ్గా స్పందించకపోవడమే కాదు.. క్షమాపణలు కూడా చెప్పకపోవడంతో.. డాలీ తమ డబ్బు రిఫండ్ చేయాలని అడిగింది. అంతేకాకుండా డాలీ, ఆమె కుటుంబం ఆరోజు బర్గర్ కింగ్ నుంచి తీసుకున్న ఫుడ్ ఏది కూడా తినకుండా.. అన్నింటినీ చెత్తబుట్టలో పారేశారట.

కాగా, ఈ ఘటనపై ఆలస్యంగా స్పందించిన బర్గర్ కింగ్ యాజమాన్యం.. జరిగినదానికి డాలీకి క్షమాపణలు చెప్పింది. అంతేకాకుండా దీనిపై దర్యాప్తు చేసి.. తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఇలాంటి సంఘటనలు మరోసారి జరగకుండా చూసుకుంటామని స్పష్టం చేసింది. కస్టమర్‌కు అన్ని సమయాల్లో సాధ్యమైనంత వరకు అత్యధిక నాణ్యత కలిగిన భోజనాన్ని అందించడమే లక్ష్యంగా బర్గర్ కింగ్ పని చేస్తుందని.. ఈ ప్రమాణాలకు అనుగుణంగా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ న్యూస్ కోసం..