Sea Cucumber: కోట్లు కురిపించే సముద్ర దోసకాయ.. ధరే కాదు.. ప్రయోజనాలు కూడా పీక్స్‌ అంతే

ప్రకృతిలో లభించే పండ్లు, కూరగాయల ధరలు అన్ని దాదాపు సామాన్యులకు అందుబాటులోనే ఉంటాయి. కానీ మేము చెప్పబోయే ఈ దోసకాయ మాత్రం సామాన్యులకు అందనంత దూరంలో ఉంటుంది. ఎందుకంటే ఈ దోసకాయ ధర ఒక వజ్రం కంటే ఎక్కువగా ఉంటుందట. ఇది ఒక్క కిలో ఏకంగా లక్షలకుపైగా ఉంటుందట. ఇంతకు ఎందుకు దీని ఇంత ధర.. దీని ప్రత్యేక ఏంటో తెలుసుకుందాం పదండి.

Sea Cucumber: కోట్లు కురిపించే సముద్ర దోసకాయ.. ధరే కాదు.. ప్రయోజనాలు కూడా పీక్స్‌ అంతే
Sea Cucumber

Updated on: Oct 18, 2025 | 10:08 PM

భారతదేశంలోని సముద్ర తీరాల్లో కనిపించే ఈ సముద్ర దోసకాయ ఒక పండు కాదు, కూరగాయ కాదు. ఇదొక ఒక ప్రత్యేకమైన సముద్ర జీవి. ఇది చూడ్డానికి దొసకాయ ఆకారాన్ని పోలి ఉంటుంది కాబట్టి దీనిని సముద్ర దోసకాయ అని పిలుస్తారు. ఇది సముద్రపు లోతుల్లో నివసిస్తుంది. ఇవి సముద్ర తలంలోని శిథిలాలను తిని సముద్ర పర్యావరణ వ్యవస్థను శుభ్రపరుస్తాయి, కాబట్టి వీటిని సముద్ర వాక్యూమ్ క్లీనర్స్ అని కూడా పిలుస్తారు. దీనిని ఆసియా దేశాలలో, ముఖ్యంగా చైనా, జపాన్‌లలో ఆహారంగా, ఔషధంగా ఉపయోగిస్తారు.

సముద్ర దోసకాయ ప్రత్యేక

ప్రపంచవ్యాప్తంగా 1,700 కంటే ఎక్కువ జాతుల సముద్ర దోసకాయలు ఉన్నాయి, ఇవి రంగు, పరిమాణం, ఆకారంలో వైవిధ్యంగా ఉంటాయి. చైనీస్ సాంప్రదాయ వైద్యంలో సముద్ర దోసకాయను జిన్‌సెంగ్ ఆఫ్ ది సీ అని పిలుస్తారు, ఇది శక్తిని పెంచడానికి, మూత్రపిండాల ఆరోగ్యానికి, లైంగిక ఆరోగ్యానికి ఉపయోగిస్తారు. ఈ ప్రత్యేకమైన జీవి ఇన్ని ప్రయోజనాలను కలిగి ఉండడం వల్ల దీని ధర చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్ని నివేదికల ప్రకారం, దీని ధర కిలోగ్రాముకు రూ.2,50,000 వరకు ఉంటుంది. అందుకే స్మగ్లర్లు దీనిని అక్రమంగా విక్రయిస్తున్నారు.

తమిళనాడులో అక్రమ రవాణా

ఈ సముద్ర దోసకాయలు అత్యధిక ధర పలుకుతుండడంతో స్మగ్లర్లు దీనిని అక్రమంగా విక్రయిస్తున్నారు. భారతదేశంలో సముద్ర దోసకాయల అక్రమ రవాణా ప్రధానంగా తమిళనాడు. శ్రీలంక తీరప్రాంతంలో జరుగుతుంది , అక్కడి నుండి విదేశాలకు ఎగుమతి చేయబడుతుంది. దీనిని అరికట్టడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నప్పటికీ, అక్రమ వ్యాపారం కొనసాగుతోంది.

అంతరించిపోతున్న జాతులు

వీటికి ఉన్న డిమాండ్‌తో అక్రమ రవాణా పెరుగుతుంది ఫలితంగా సముద్రంలో వీటి సంఖ్య తగ్గుతంది. దీని వల్ల సముద్ర దోసకాయలను ఇప్పుడు అంతరించిపోతున్న సముద్ర జాతుల జాబితాలో చేరాయి. వాటిని రక్షించడానికి, భారత ప్రభుత్వం చేపలు పట్టడం, వాణిజ్యంపై కఠినమైన ఆంక్షలు విధించింది.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.