పాము.. ఈ పేరు వినగానే చాలా మంది భయంతో పరుగులు తీస్తారు..దానికి వీలైనంత దూరంగా పరుగులు పెడతారు. మరి కొందరు పాములతో ఆటలాడుతుంటారు. వాటితో కలిసి తింటారు. తిరుగుతారు. కలిసే పడుకుంటారు కూడా. కానీ, పాము విషం ప్రమాదం. పాము కాటు క్షణాల్లో ప్రాణం తీస్తుంది. కాకపోతే, పాములకు సంబంధించిన వార్తలు, వీడియోలను ప్రజలు ఆసక్తిగా తెలుసుకునేందుకు ఉత్సుకత ప్రదర్శిస్తుంటారు. అయితే పాముల గురించి చాలా మందికి తెలియని కొన్ని విషయాలు ఉన్నాయి. ఇక్కడ మనం పాముల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.
పాము మాంసాహార జంతువు. ఇది ఎలుకలు, ఇతర కీటకాలను తింటుంది. అలాగే పాములకు పాలు ఒక్కటే ఆహారం కాదు. అంతేకాకుండా, పాముకు చెవులు లేవు. వీటికి జ్ఞాపకశక్తి కూడా తక్కువగానే ఉంటుంది. అలాగే, పాము ఎక్కువగా నాలుకను బయటపెట్టడం మీరు చూసి ఉండవచ్చు. కానీ అలా ఎందుకు చేస్తుందో చాలా మందికి తెలియదు. నిజానికి పాము తన నాలుకతో వాసన చూస్తుంది. కాబట్టి, అవి నాలుకలను బయట పెట్టుకుంటూ ఆహారం కోసం వెతుక్కుంటూ ఉంటుంది. ఇది తన చుట్టూ ఉన్న జంతువులను కూడా అంచనా వేస్తుంది. భూమ్మీద ప్రాణాంతకమైన జీవులలో పాములు ఒకటి. పాములు వివిధ పరిమాణాలు, రంగులు, నమూనాలలో కనిపిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2500 నుండి 3000 రకాల పాములు ఉన్నాయి.
ఇకపోతే, అన్ని పాములు విషపూరితమైనవి కావు. పాములకు కనురెప్పలు, బాహ్య చెవులు ఉండవు. పాములకు కనురెప్పలు, బాహ్య చెవులు లేవు. వాటి నోట్లో ఫ్లెక్సిబుల్ దవడలు ఉంటాయి. పాములు పెరిగేకొద్దీ వాటి చర్మాన్ని వదిలేస్తుంటాయి. పాములు అవయవాలు లేని పొడవైన సరీసృపాలు. అంతేకాదు.. వీటిలో కూడా అన్ని పాములు గుడ్లు పెట్టవు. పాములు ఎక్టోథెర్మిక్, అంటే అవి తమ శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి బాహ్య ఉష్ణ వనరులపై ఆధారపడతాయి.కొన్ని పాములు ఎగురుతాయి కూడా.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..