
సాధారణంగా బర్త్ సర్టిఫికేట్ ఈ రోజుల్లో ఎంతో ముఖ్యం. ఈ సర్టిఫికేట్ కావాలంటే ఎక్కడ పుట్టామో అక్కడికి వెళ్లి తీసుకోవాలి. ఏ ఆస్పత్రిలో పుడితే అక్కడి తీసుకోవడం లేదా, గ్రామ పంచాయతీ నుంచి, అలాగే ఈ మధ్య మీ సేవ కేంద్రాల నుంచి తీసుకోవడం తప్పనిసరైంది. ఆ సర్టిఫికేట్‌లో పుట్టిన తేదీ, సమయం, ఎక్కడి పుట్టాము, ఏ కులము, లింగం తదితర వివరాలు ఉంటాయి. అయితే ఏ దేశంలో పుడితే అక్కడి పుట్టిన తేదీ ఆధారంగా పౌరసత్వం పొందే అవకాశం ఉంటుంది. మరి ఆకాశంలో పుడితే ఎలా..? ఏంటి ఆకాశంలో పుట్టడం ఏంటని అనుకుంటున్నారా..? అదేంలేదండి.. మన ప్రయాణిస్తున్న విమానంలో జన్మించినట్లయితే పుట్టిన స్థలంలో ఏ ప్రాంతాన్ని నమోదు చేస్తారు..? మరి ఆకాశంలో ఎగిరే విమానంలో పుట్టినట్లయితే ఏ దేశ పౌరసత్వాన్ని జారీ చేస్తారు..?
సాధారణంగా గర్భిణీ స్త్రీలు 9వ నెలలో ప్రయాణం చేయకుండా ఉంటారు. ఈ గర్భిణీ సమయంలో ప్రయాణాలు చేయవద్దని వైద్యులు సూచిస్తుంటారు. అయితే నిబంధనల ప్రకారం.. 7 నెలలు లేదా అంతకన్న ఎక్కువ నెలుల నిండిన గర్భిణులు భారతదేశంలో విమానంలో ప్రయాణించేందుకు అనుమతి ఉండదు. కానీ అత్యవసరమైన పరిస్థితులను బట్టి మాత్రమే అనుమతి ఉంటుంది. 7 నెలల తర్వాత విమానం ప్రయాణం చేయాలంటే అందుకు కారణాలను చూపెట్టి విమాన ప్రయాణానికి అనుమతి పొందాల్సి ఉంటుంది. అందుకే భారత్ నుంచి అమెరికా వెళ్తున్నప్పుడు ఒక మహిళ ఒక బిడ్డకు జన్మనిస్తే ఆ బిడ్డ జన్మస్థలం ఏ ప్రాంతం ఉంటుందనేది పెద్ద ప్రశ్న.
విమానంలో ప్రయాణించే గర్భిణులు బిడ్డకు జన్మనిచ్చినట్లయితే ముందుగా సరిహద్దులను చూడాల్సి ఉంటుందని ఎయిర్‌ఫోర్ట్ అథారిటీ అధికారులు చెబుతున్నారు. విమానంలో బిడ్డ జన్మించిందంటే ఆ బిడ్డ పుట్టే సమయంలో ఏ దేశ సరిహద్దులో విమానం ప్రయాణించిందో విమానం ల్యాండ్ అయిన తర్వాత సంబంధిత దేశంలోని ఎయిర్‌పోర్ట్ అథారిటీ నుంచి పిల్లల జనన ధృవీకరణ పత్రాన్ని పొందవచ్చు. పిల్లల జనన ధృవీకరణ పత్రంలో ఆ దేశం పేరును నమోదు చేయబడుతుంది. అలాంటి సమయంలో ఆ బిడ్డ ఆ దేశం పౌరసత్వం పొందవచ్చు. అలాగే తల్లిదండ్రులు నివసిస్తున్న దేశం పౌరసత్వం కూడా పొందే హక్కు ఉంటుంది.
ఉదాహరణకు.. శ్రీలంక నుంచి అమెరికా వెళ్లే విమానంలో భారత సరిహద్దు మీదుగా వెళుతోందని అనుకుందాం. ఆ సమయంలో శ్రీలంక మహిళ విమానంలో ఓ బిడ్డకు జన్మినిచ్చిందనుకుందాం. అలాంటి పరిస్థితుల్లో పిల్లల జన్మస్థలం భారతదేశంగా పరిగణించబడుతుంది. ఈ విధంగా విమానంలో పుట్టిన బిడ్డకు భారత పౌరసత్వం లభిస్తుంది. అయితే తల్లిదండ్రులది శ్రీలంక కావడం వల్ల ఆ బిడ్డకు శ్రీలంక పౌరసత్వం పొందే హక్కు కూడా ఉంటుంది.
ఇలాంటి సంఘటన గత కొన్నేళ్ల కిందట అమెరికాలో చోటు చేసుకుంది. నెదర్లాండ్ రాజధాని ఆమ్‌స్టర్‌డామ్ నుంచి ఒక విమానం అమెరికాకు బయలుదేరింది. విమానం అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా వెళ్తుండగా, విమానంలో ఉన్న ఓ మహిళ పురిటి నొప్పులు వచ్చాయి. విమానంలోనే ఆ మహిళ ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డకు ఆనారోగ్యంగా ఉండటంతో యూఎస్‌లోని మసాచుసెట్స్ జనరల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అలాంటి సమయంలో బిడ్డ ఆమెరికా సరిహద్దులో పుట్టడంతో ఆమెకు అమెరికా పౌరసత్వం లభించింది. దీంతో పాటు బిడ్డ తల్లిదండ్రులు నెదర్లాండ్‌కు చెందిన వారు కావడంతో రెండు దేశాల పౌరసత్వం కూడా ఉంటుంది.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి