Watch Video: మీరు తినే కూరగాయలు నిజంగా ఫ్రెష్‌వేనా? ఈ వీడియో చూస్తే గుండెదడ పుట్టాల్సిందే..

|

Mar 18, 2023 | 5:20 PM

Viral Video: గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఆరుగాలం శ్రమించి, పంటలు పండించి ప్రజల ఆకలిని తీరుస్తున్నారు. ప్రజలకు అవసరమైన ఆహార పంటలను అందిస్తున్నారు.

Watch Video: మీరు తినే కూరగాయలు నిజంగా ఫ్రెష్‌వేనా? ఈ వీడియో చూస్తే గుండెదడ పుట్టాల్సిందే..
Vegetables
Follow us on

గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఆరుగాలం శ్రమించి, పంటలు పండించి ప్రజల ఆకలిని తీరుస్తున్నారు. ప్రజలకు అవసరమైన ఆహార పంటలను అందిస్తున్నారు. అయితే, కూరగాయలను ప్రాంతాల నుంచి నగరంలోని కూరగాయల మార్కెట్ కేంద్రాలకు తరించి, విక్రయిస్తుంటారు. అయితే, ప్రజలు తమకు తాజా కూరగాయలు కావాలని చూస్తారు. అందుకోసం మంచి కూరగాయల కోసం వెతుకుతుంటారు. వీటిని తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని విశ్వాసం. అయితే, ఈ మధ్య కాలంలో కూరగాయలు పండించేందుకు విపరీతమైన పెస్టిసైడ్స్, ఇతర మందులను వినియోగిస్తున్నారు. తద్వారా పంటల కాల వ్యవధి తగ్గుతుంది. త్వరలోనే పంట చేతికి అందివస్తోంది.

మరోవైపు గ్రామీణ ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన కూరగాయలు, ఆకు కూరలు వాడిపోవడంతో.. వాటిని తాజాగా మార్చేందుకు రసాయనాలలో ముంచి తీస్తున్నారు. ఇలా చేయడం వల్ల వెంటనే అవి తాజా కూరగాయల మాదిరిగా మారిపోతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కూరగాయలకు కలర్స్ వేయడం, ఆకు కూరలను రసాయనాల్లో ముంచడం ఈ వీడియోల్లో స్పష్టం కనిపిస్తోంది. అది చూసి నెటిజన్లు షాక్ అవుతురన్నారు.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ కూరగాయల మార్కెట్‌లో పాలకూర వాడిపోయి ఉంది. అలా వాడిపోయిన పాలకూర కట్టను.. ఓ రసాయన ద్రవంలో ముంచి తీశారు. అప్పటి వరకు వాడిపోయి ఉన్న పాలకూర… రసాయనద్రవంలో ముంచి తీయగానే చాలా ప్రెష్‌గా కనిపించింది. అది చూసి జనాలు బిత్తరపోతున్నారు. ఇలాంటి చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని నెటిజన్లు ప్రజలను కోరుతున్నారు. కూరగాయల విక్రయదారులు సైతం ఇలా ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ షాకింగ్ మీడియోపై మీరూ ఓ లుక్కేసుకోండి.

మరిన్ని హ్యూమన్‌ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..