Watch Video: గాజు బాక్స్‌లో కొండచిలువను పెంచుకుంటున్న మహిళ.. మూత ఓపెన్ చేయగానే.. చూస్తే గూస్‌బంప్సే!

|

Oct 27, 2022 | 1:49 PM

మనవాళ్లు కొన్నింటిని పెంపుడు జంతువులుగా పెంచుకుంటుంటారు. అయితే విదేశాల్లో కొంచెం డిఫరెంట్.. అక్కడ ఉండే కొందరికి విషసర్పాలను..

Watch Video: గాజు బాక్స్‌లో కొండచిలువను పెంచుకుంటున్న మహిళ.. మూత ఓపెన్ చేయగానే.. చూస్తే గూస్‌బంప్సే!
Python Attack
Follow us on

కుక్కలు, పిల్లులు, పావురాలు.. ఇలా మనవాళ్లు కొన్నింటిని పెంపుడు జంతువులుగా పెంచుకుంటుంటారు. అయితే విదేశాల్లో కొంచెం డిఫరెంట్.. అక్కడ ఉండే కొందరికి క్రూర మృగాలు, విషసర్పాలను పెంచుకోవడం అలవాటు. అప్పుడప్పుడూ పెంపుడు జంతువులే.. తమ యజమానులపై దాడి చేస్తున్న సందర్భాలు మనం చూస్తూనే ఉంటాం. అలాంటిది విషసర్పాల మాటకొస్తే.. మన ప్రాణాలకే ప్రమాదం ఏర్పడవచ్చు. సరిగ్గా ఇదే రీతిలో ఓ ఘటన చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూస్తే మీరూ భయపడటం గ్యారెంటీ..

వీడియో ప్రకారం.. ఓ మహిళ తన ఇంట్లోని ఒక గాజు బాక్స్‌లో కొండచిలువను పెంచుకుంటోంది. రోజూ దానికి ఆహారం వేస్తూ.. నిత్యం పర్యవేక్షిస్తోంది. ఈ క్రమంలోనే దాన్ని ఓ రోజు బాక్స్ నుంచి బయటకు తీస్తుండగా.. అది అనూహ్యంగా దాడి చేస్తుంది. సదరు మహిళ చేతిని కొరకడమే కాదు.. చుట్టుకుపోయి.. ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. దీన్ని గమనించిన పక్కనే ఉన్న వ్యక్తి.. కొండచిలువ పట్టును విడిపించేందుకు ప్రయత్నిస్తాడు. వారిద్దరూ ఎంత ప్రయత్నించినా కొండచిలువ మహిళ చేతిని విడిచిపెట్టదు.. చివరికి రక్తస్రావం కూడా అవుతోంది. అయితే ఎలాగోలా ఆఖరికి కొండచిలువను పక్కకు లాగేయడంతో.. అక్కడున్న వారంతా హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటారు. కాగా, ఈ వీడియోపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.