Rs.10 Biryani: ఘుమ ఘుమలాడే హైదరాబాదీ బిర్యానీ రూ.10కే.. ఎక్కడో తెలుసా..!

|

Mar 17, 2021 | 11:20 AM

Biryani for Rs.10 Only: ఖరీదైన హైదరాబాదీ బిర్యానీ రూ.10కే లభిస్తే? వామ్మో, ఇంకేమైనా ఉందా? జనం ఎగబడిపోరూ...

Rs.10 Biryani: ఘుమ ఘుమలాడే హైదరాబాదీ బిర్యానీ రూ.10కే.. ఎక్కడో తెలుసా..!
Biryani For Rs.10 Only
Follow us on

Biryani For Rs.10 Only Afzalgunj: ఒక బిర్యానీ తినాలంటే కనీసం రూ.100 వరకు ఖర్చవుతుంది. అదే రెస్టారెంట్‌లో తినాలంటే రూ.180.. మరింత పెద్ద రెస్టారెంట్‌లో బిర్యానీ ఆర్డర్ చేస్తే రూ. 240… మరి, ఇంత ఖరీదైన హైదరాబాదీ బిర్యానీ కేవలం రూ.10కే లభిస్తే? వామ్మో, ఇంకేమైనా ఉందా? జనం ఎగబడిపోరూ. కానీ, రూ.10కే బిర్యానీ అందించే రెస్టారెంట్ ఎక్కడుందా అనే కదా మీ డౌటు..? తొందరపడకండీ.. అదెక్కడో ఇక్కడ చదవండి…

ఇలా విలువైన బిర్యానీని అతి తక్కువ ధరకే విక్రయించాడు. చికెన్ బిర్యానీ రూ.10 అందిస్తున్నాడు. అంతా టిఫిన్ హోటల్స్ పెడితో ఇతగాడు బిర్యాటీని హోటల్ పెట్టేశాడు. అతి తక్కవ ధరకు తినిపిస్తున్నాడు. హైదరాబాద్ అఫ్జల్‌గంజ్‌లో తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. ఎంతో బిజీగా ఉండే సెంటర్‌ను తన హోటల్ పాయింట్‌గా ఎంచుకున్నాడు. ఎంతో హాట్ హాట్‌గా అద్భుతమైన టెస్ట్‌తో వేడి వేడి వెజిటేబుల్ బిర్యానీను అందిస్తున్నాడు. ప్రపంచం మొత్తం మెచ్చుకునే హైదరాబాద్ బిర్యానీని తినిపిస్తూ శబాష్ అనిపించుకుంటున్నాడు. అస్కా బిర్యానీ స్టాల్ పేరుతో  అఫ్జల్‌గంజ్ బస్టాప్ సమీపంలో ఏర్పాటు చేశాడు. దీని యజమాని ఇఫ్తికార్ మొమిన్.

తెలుగు రాష్ట్రాల్లోని జనం అఫ్జల్‌గంజ్‌కు పెద్ద ఎత్తున వస్తుంటారు. ఇక్కడి వచ్చినవారు హోల్ సేల్ షాపింగ్ చేస్తుంటారు… ఇలా ఇక్కడకిి వచ్చినవారు బిర్యానీ తినకుండా వెళ్లరంటే నమ్మండి. ఇఫ్తికార్ మొమిన్ ఈ హెటల్‌ను పదేళ్ల క్రితం ఏర్పాటు చేశాడు. అప్పటి నుంచి ఒకేరకమైన రుచి అందిస్తున్నాడు. ఉదయం 7 గంటల నుంచి అర్థరాత్రి వరకు బిర్యానీ వేడి వేడిగా అందిస్తుంటాడు. కేవలం పది రూపాయలకు బిర్యానీ ఇస్తుండటంతో ఇక్కడి వచ్చే వ్యాపరస్తులతో పాటు… అఫ్జల్‌గంజ్‌లో కూలీ పనులు చేసుకునేవారు తెగ ఇష్టపడి మరీ తింటుంటారు.

హోటల్ ప్రారంభించిన కొత్తలో ఇదే వెజ్ బిర్యానీని రూ.5 అందించేవాడు. రోజు.. రోజుకు పెరుగుతున్న నిత్యవసర సరుకులతోపాటు ఖర్చులు పెరిగిపోవడంతో రేటు పెంచాల్సి వచ్చిందని అంటున్నాడు ఇఫ్తికార్ మొమిన్. అయితే ఇప్పడు ఇదే తరహాలో బిర్యానీ స్టాల్స్‌ని ఉస్మానియా జనరల్ హాస్పిటల్, కోటి ఉమెన్స్ కాలేజీ బస్టాప్, అబిడ్స్‌లోని జనరల్ పోస్టాఫీస్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో కూడా ప్రారంభించినట్లుగా వెల్లడించారు. మనమూ ఓసారి రుచి చూద్దామా…

ఇవి కూడా చదవండి…

లోటస్‌పాండ్‌ పార్టీ ప్రకటనకు ముహూర్తం ఫిక్స్‌.. తాను ఎవరి బాణాన్ని కాదన్న వైయస్ షర్మిల

పదివేలతో ఈ వ్యాపారం ప్రారంభించండి.. నెలకు లక్షల్లో ఆదాయం సంపాదించండి.. సింపుల్ బిజినెస్..