Vastu Tips: చెప్పుల విషయంలో ఈ పొరపాట్లు చేస్తున్నారా..? అయితే జీవితంలో అష్ట దరిద్రాలే..!

వాస్తు శాస్త్రం ప్రకారం చెప్పుల స్థానం ఇంట్లో కీలక పాత్ర పోషిస్తుంది. షూ స్టాండ్‌ను సరైన చోట ఉంచితే నెగెటివ్ ఎనర్జీ తగ్గి శాంతి, సంపద లభిస్తాయి. శనిదేవుడికి పాత చెప్పులు నచ్చవు కనుక వాటిని తొలగించాలి. మంచి దిశల్లో చెప్పులు ఉంచి, వాస్తు నియమాలను పాటించడం ద్వారా కుటుంబంలో శుభపరిణామాలు ఉంటాయి.

Vastu Tips: చెప్పుల విషయంలో ఈ పొరపాట్లు చేస్తున్నారా..? అయితే జీవితంలో అష్ట దరిద్రాలే..!
వేసవిలో బూట్లు ఎక్కువగా ఇష్టపడే వారు ఈ విషయాలు కొన్ని తెలుసుకుంటే మంచిది. వేసవిలో బూట్లు వేసుకునే వారి పాదాలకు గాలి అంతగా తగలదు. చాలా మంది రోజంతా బూట్లు ధరిస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా సాక్స్‌లను ధరించి నడవకూడదు. ఎండ, వేడి కారణంగా పాదాలు విపరీతంగా చెమట పడుతుంటాయి. బూట్లు బిగుతుగా ఉండటం వల్ల పాదాలు దుర్వాసన వస్తాయ. ఈ సీజన్‌లో వీలైనంత వరకు తోలు బూట్లు ధరించడం మానుకోవాలి.

Updated on: Jan 27, 2025 | 7:21 PM

వాస్తు శాస్త్రం ప్రకారం.. ప్రతి వస్తువు సరైన దిశలో ఉండాలి. లేకుంటే అది నెగెటివ్ ఎనర్జీని పెంచి కుటుంబానికి దుష్పరిణామాలు కలిగిస్తుంది. ముఖ్యంగా చెప్పుల స్థానం గురించి స్పష్టమైన నియమాలు ఉన్నాయి. సరైన దిశలో చెప్పులు ఉంచడం ద్వారా శుభపరిణామాలు పొందవచ్చు.

చెప్పుల స్టాండ్ కి కరెక్ట్ ప్లేస్

చెప్పుల స్టాండ్ బయటే ఉంచడం మంచిది. కానీ అవి తూర్పు, ఉత్తరం, ఈశాన్యం లేదా ఆగ్నేయ దిశలలో ఉండకూడదు. వీటి స్థానాలు నెగెటివ్ ఎనర్జీని ఇంట్లోకి తీసుకువస్తాయి. అందుకే పశ్చిమ లేదా వాయువ్య దిశల్లో చెప్పుల స్టాండ్ ఉంచడం శ్రేయస్కరం. ఇది కుటుంబంలో శాంతిని పెంచుతుంది, ధనసంపదను ఆకర్షిస్తుంది.

చెప్పుల స్టాండ్ అక్కడ ఉంచకండి

చెప్పుల స్టాండ్‌ను పూజగది లేదా కిచెన్ సమీపంలో ఉంచడం అసాధువుగా భావించబడుతుంది. ఇది కుటుంబ శ్రేయస్సుపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమీపంలో చెప్పులు లేకుండా బాల్కనీలో వాడకానికి అనుకూలమైన చోటే అమర్చడం మంచిది. కానీ అక్కడ కూడా చెప్పులు పశ్చిమ లేదా వాయువ్య దిశలో ఉండేలా చూసుకోవాలి.

పాత చెప్పుల వల్ల నష్టాలు

పాత, చిరిగిన, విరిగిన చెప్పులను ఇంట్లో ఉంచడం వాస్తు రీత్యా మంచిది కాదు. శనిదేవుడికి ఈ అలవాటు నచ్చదు ఇది దరిద్రాన్ని మోసుకువస్తుందట. పాత చెప్పులను తక్షణం తొలగించి ఇంటిని శుభ్రంగా ఉంచడం మేలు.

లక్ష్మీదేవి కటాక్షం దూరం

ఇంట్లో చెప్పుల్ని చెల్లాచెదురుగా వదలడం మంచిది కాదు. అవి సరైన స్థానంలో ఉంచకపోతే ఇంటి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. పైగా దీని వల్ల లక్ష్మీదేవి కటాక్షం దూరమవుతుంది. అందుకే చెప్పులను బోర్లా పెట్టకూడదు, అన్నివేళలా అవి గమనించదగిన ప్రదేశంలో ఉండకుండా చూసుకోవాలి.

వాస్తు నియమాల ప్రకారం చెప్పుల స్థానాన్ని సరిగ్గా అమర్చడం ద్వారా కుటుంబంలో శాంతి, ఆరోగ్యం, ధనసంపత్తి లభిస్తాయి. సరైన దిశల్లో చెప్పులు ఉంచడం, పాత చెప్పులను తొలగించడం, చెల్లాచెదురుగా ఉంచకుండా చూసుకోవడం మీ జీవితానికి శుభపరిణామాలు తెస్తుంది.

(ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది)