సివిల్ అభ్యర్థులకు గుడ్‏న్యూస్.. గతేడాది మిస్సయినవారికి మళ్లీ ఛాన్స్.. క్లారిటీ ఇచ్చిన యూపీఎస్సీ..

|

Feb 05, 2021 | 4:48 PM

సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ అందించింది కేంద్రం. కరోనా మహామ్మారి కారణంగా 2020లో యూనియన్ సివిల్ సర్వీసెస్ పరీక్షకు లాస్ట్ అటెంప్ట్ చేసిన అభ్యర్థులకు మళ్ళీ అవకాశం కల్పిస్తామని

సివిల్ అభ్యర్థులకు గుడ్‏న్యూస్.. గతేడాది మిస్సయినవారికి మళ్లీ ఛాన్స్.. క్లారిటీ ఇచ్చిన యూపీఎస్సీ..
Follow us on

UPSC Civil Services Exam: సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ అందించింది కేంద్రం. కరోనా మహామ్మారి కారణంగా 2020లో యూనియన్ సివిల్ సర్వీసెస్ పరీక్షకు లాస్ట్ అటెంప్ట్ చేసిన అభ్యర్థులకు మళ్ళీ అవకాశం కల్పిస్తామని కేంద్రం సూప్రీంకోర్టుకు తెలియజేసింది.

గతేడాది అక్టోబర్‍లో నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలో లాస్ట్ అటెంప్ట్ చేసి.. కరోనా ప్రభావంతో మిస్సయినవారికి.. యూపీఎస్సీ పరీక్ష రాయడానికి మళ్లీ ఛాన్స్ ఇవ్వాలని  సివిల్ సర్వీసెస్ అభ్యర్థి రచనా సింగ్ వేసిన పిటిషన్‏ను సుప్రీంకోర్టు విచారించింది. కాగా సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష అక్టోబర్ 4న జరిగింది. నిజానికి ఈ ఎగ్జామ్ మేలో జరగాల్సి ఉంది. కానీ కరోనా ప్రభావంతో ఈ ఎగ్జామ్ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో 2020 సెప్టెంబరులో ఉన్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వం మరియు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC)ను 2020లో లాస్ట్ అటెంప్ట్ చేసిన అభ్యర్థుల ఏజ్ లిమిట్‏ను పెంచే విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని సూచించింది.

లాస్ట్ అటెంప్ట్ చేసిన అభ్యర్థులకు సంబంధించి మళ్లీ చాన్స్ ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నామని యూపీఎస్సీ సూప్రీంకోర్టుకు తెలిపింది. అభ్యర్థులకు మళ్లీ ఛాన్స్ ఇచ్చే విషయంలో తాము అనుకూలంగా లేమని.. ఇది క్యాస్కేడింగ్ ప్రభావాన్ని సృష్టిస్తుందని.. పబ్లిక్ ఎగ్జామినేషన్ సిస్టంపై ఇది ప్రభావం చూపిస్తుందని జనవరి 22న కేంద్రం సూప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. అక్టోబర్ 4న జరిగిన పరీక్షకు మొత్తం 4,86,952 మంది అభ్యర్థులు హాజరయ్యారని కేంద్రం తెలిపింది. 2020 సివిల్ ఎగ్జామ్ ముగిసింది. ఈ పరీక్షలు జవరి 8 నుంచి 17 వరకు జరిగాయి. ప్రిలిమినరి పరీక్షల్లో పొందిన మార్కుల ఆధారంగా దాదాపు 1000 మంది అభ్యర్థులు మెయిన్ ఎగ్జామ్‏కు ఎంపికయ్యారు. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2021 నోటిఫికేషన్ ఫిబ్రవరి 10న విడుదల కానుంది.

Also Read:

మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా ? ఇందులో ఉండే ఈఎంఐ ఆప్షన్ వల్ల ఎన్ని లాభాలో..