viral video: మేకలు ఆకులు తింటాయని మనకు తెలుసు. చెట్టు కు ఉన్నఆకుల్లో వాటికీ అందేంత ఎత్తులో వాటిని అవి తింటుంటాయి. బాగా ఆకలేస్తే మాత్రం పైనున్న ఆకులను అందుకుకోవడానికి ప్రయత్నిస్తాయి. అయితే ఇక్కడి మేకలు మాత్రం నేల పై నిల్చొని మేడలు పోయేలా కొమ్మలు వంచుకుని కష్టపడి తినాల్సిన పనిలేకుండా ఏం చక్కా చెట్టేక్కి కావాల్సినంతా తిండిని ఆరగించేస్తున్నాయి.
అసలు మేకలు చెట్టు ఎలా ఎక్కుతాయి. వాటికి చెట్లు ఎక్కటం రాదుకదా..? అనే డౌట్ వస్తుంది కదూ..? అయితే, ఇది భారీ కొమ్మలతో నరికివేసిన చెట్టుగా తెలుస్తోంది. దీంతో ఆ చెట్టు కొమ్మలు నేలకు సమాంతరంగా పడివుండటంతో మేకలు ఈజీగా చెట్టేక్కి హ్యాపీ భుజించేస్తున్నాయి. చెట్టునిండా కనిపించిన మేకలను చూసిన స్థానికులు కొందరు అదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ మేకలు కూడా ఇప్పుడు నెట్టింట్లో సందడి చేస్తున్నాయి. కొందరు తెలివైన మేకలు అని, మరికొందరు కూటి కోసమే కోటి విద్యలు అని కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో పాతదే అయినప్పటికీ మరోసారి ఈ ఇస్మార్డ్ మేకలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఈ వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. ఈ వీడియో పై మీరు ఓ లుక్కేయండి
మరిన్ని ఇక్కడ చదవండి :
3000 Year Golden City: 3 వేల ఏళ్ల తర్వాత పురావస్తు తవ్వకాల్లో బయటపడ్డ బంగారు నగరం.. ఎక్కడంటే..!