
మీరు ట్రైన్‌లో ప్రయాణించేప్పుడు ప్రతి బోగీలో.. అత్యవసర పరిస్థితుల్లో ట్రైన్‌ను ఆపేందుకు ఇక్కడ ఉన్న చైన్ లాగుము’.. అని రాసి ఉండడం మీరు చూసే ఉంటారు. దాదాపు ట్రైన్‌లోని ప్రతీ కోచ్ లో ఇది ఉంటుంది. దానిలో పాటు ఎరుపు ఈ చైన్ కూడా ఉంటుంది. దాన్ని లాగితే వెంటనే ట్రైన్ ఆగిపోతుంది. చైన్ లాగితే ట్రైన్ ఆగుతుందనే విషయం అందరికీ తెలుసు కానీ అదెలా పనిచేస్తుందో చాలా మందికి తెలియదు. కాబట్టి అదేలా పనిచేస్తుందిన దాని వెనక జరిగే ప్రక్రియ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం
ట్రైన్‌లో ప్రతి బోగిలో ఉండే ఈ చైన్ డైరెక్ట్‌గా ట్రైన్ బ్రేకింగ్ సిట్టంమ్‌కు అనుసంధానం చేసి ఉంటుంది. ఏవైనా అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులు చైన్ లాగినప్పుడు.. ఏ కోచ్‌లో నైతే చైన్ లాగారో.. ఆ కోచ్ లోని బ్రేక్ ఎయిర్ పైప్ వాల్వ్ ఓపెన్ అవుతుంది. దీంతో రైలు ఇంజన్ క్యాబిన్ లోని మీటర్ లో ఎయిర్ ప్రెషర్ తగ్గిపోతుంది. అప్పుడు ఇంజన్‌లో అలారం మోగుతుంది. అప్పుడు లోకో పైలట్ అప్రమత్తం అవుతారు. వెంటనే రైలు గార్డును, భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేయడానికి మూడుసార్లు హారన్ ఇచ్చిన తర్వాత బ్రేక్ వేసి ట్రైన్‌ను ఆపేస్తాడు. దీంతో ట్రైన్ ఆగిపోతుంది.
ట్రైన్ ఆగిన వెంటనే గార్డు, భద్రతా సిబ్బంది చైన్ లాగబడిన కోచ్ దగ్గరకు వచ్చి కారణం తెలుసుకుంటారు. అత్యవసర పరిస్థితి అయితే దాని సాల్వ్ చేసేందుకు చర్యలు తీసుకుంటారు. అలా కాదని, సరదా కోసం ఇలా చైన్ లాగారని తెలిస్తే వారిపై చర్యలు తీసుకుంటారు. అదనంగా రూ.1000 జరిమానా కూడా విధిస్తారు. మరోసారి ఇలాంటి పనులు చేయవద్దని హెచ్చరిస్తారు.