Bullock Cart Race: మహారాష్ట్రలో సాంప్రదాయ వేడుక ఎడ్ల బండ్ల పందాల నిర్వహణకు సుప్రీంకోర్టు గురువారం అనుమతినిచ్చింది. ఈ సందర్భంగా ఒకే దేశం, ఒకే జాతి, మనకు ఏకరూపతతో పాటు ఒకే నియమం ఉండాలి… ఇతర రాష్ట్రాల్లో రేసులు జరుగుతుంటే, మహారాష్ట్ర ఎందుకు అనుమతించకూడదని అని ధర్మాసనం విచారణ సందర్భంగా పేర్కొంది.
జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టంలో చేసిన సవరణలు, దాని కింద చేసిన నిబంధనల ఆధారంగా మహారాష్ట్రలో ఎడ్ల బండ్ల పందాలు నిర్వహించేందుకు సుప్రీంకోర్టు గురువారం అనుమతినిచ్చింది.
రాష్ట్రంలో ఎడ్ల బండ్ల పందాల నిర్వహణకు వ్యతిరేకంగా బొంబాయి హైకోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్‌ను సవాలు చేస్తూ.. 2018లో దాఖలు చేసిన మహారాష్ట్ర స్పెషల్ లీవ్ పిటిషన్‌పై న్యాయమూర్తులు ఏఎం ఖాన్విలార్, సీటీ రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం మధ్యంతర దరఖాస్తును విచారించింది.
జల్లికట్టు వంటి సాంప్రదాయ జంతు క్రీడల కార్యక్రమాలను నిషేధిస్తూ, జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం కింద వాటిని నేరాలుగా పేర్కొంటూ దాఖలైన పిటిషన్ ని విచారిస్తూ.. ఈ కేసులో తీర్పుని సుప్రీం కోర్టు వెలువరించింది.
తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు జల్లికట్టు , గేదెల పందేలు నిర్వహించేందుకు వీలుగా పీసీఏ చట్టానికి సవరణలు చేశాయని ధర్మాసనం పేర్కొంది. ఆ సవరణల చెల్లుబాటును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేసినప్పటికీ, 2 న్యాయమూర్తుల బెంచ్ వాటిపై ఎటువంటి మధ్యంతర స్టే విధించలేదు. విస్తృతమైన విచారణల అనంతరం ఉత్తర్వులను రిజర్వ్ చేసిన తర్వాత 2 న్యాయమూర్తుల బెంచ్ ధర్మాసనానికి రిఫర్ చేసింది. “ఇతర రాష్ట్రాలలో చేసిన సవరణల మాదిరిగానే మహారాష్ట్ర రాష్ట్రంలోని నిబంధనలకు కూడా అదే నిర్ణయాన్ని వర్తింపజేయాలి” అని బెంచ్ ప్రస్తావించింది.
Also Read: చిన్నారిని నిద్రలేపిన కుక్క.. డిస్టర్బ్ చేస్తుందనుకున్న తల్లిదండ్రులు.. తీరా చూస్తే..