ప్రభుత్వం ఉద్యోగమే జీవితానికి భద్రత అని భావించే యువతీయువకులకు దేశంలో కొదువ లేదు. చిన్న పెద్ద ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకమైన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) పరీక్షకు లక్షలాది మంది యువత రెడీ అవుతూ ఉంటారు. అయితే వారిలో కొంతమంది మాత్రమే సక్సెస్ ను అందుకుంటారు. అయితే.. కొంతమంది తమ సామర్థ్యాన్ని బాగా అర్థం చేసుకుని.. ఏ పని చేపట్టినా విజయం సాధిస్తూ ఉంటారు. అలాంటి యువకుల్లో ఒకరు ప్రేమ్ సుఖ్ దేలు. ఆరేళ్లలో 12 ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన రాజస్థాన్ నివాసి ప్రేమ్ సుఖ్ దేలు నేటి తరానికి స్ఫూర్తి..
రాజస్థాన్‌లోని బికనీర్ నివాసి అయిన ప్రేమ్ సుఖ్ దేలు రైతు కుటుంబంలో జన్మించారు. విజయం.. కృషి, పట్టుదలతో లభిస్తుంది.. అదృష్టం మీద ఆధారపడి కాదు అని నిరూపించారు ప్రేమ్ సుఖ్.. ప్రేమ్ సుఖ్ దేలు ఆరేళ్ల వ్యవధిలో UPSCతో సహా ఒకటి లేదా రెండు కాదు 12 ప్రభుత్వ ఉద్యోగాలను సాధించారు.
ప్రేమ్ సుఖ్ దేలు రైతు కుటుంబంలో జన్మించారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే.. తండ్రి ఒంటెల బండి నడిపేవాడు.. వస్తువులను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి రవాణా చేసేవాడు. చిన్నప్పటి నుంచి ప్రేమ్ తన కుటుంబాన్ని పేదరికం నుంచి గట్టెక్కించాలని లక్ష్యంతో చదువుపైనే దృష్టి పెట్టారు.
ప్రేమ్ సుఖ్ దేలు తన సొంత గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి వరకు చదివారు. ఆ తర్వాత బికనీర్‌లోని ప్రభుత్వ దుంగార్ కళాశాలలో తదుపరి చదువులు చదివాడు. హిస్టరీలో ఎంఏ చేసి గోల్డ్ మెడల్ సాధించారు. UGC-NET , JRF పరీక్షలలో ఉత్తీర్ణత సాధించారు. ప్రేమ్ సుఖ్ దేలు అన్నయ్య .. పోలీస్‌లో కానిస్టేబుల్ , పోటీ పరీక్షలు రాసేలా ప్రేమ్‌ను ప్రేరేపించాడు. 2010లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత.. పట్వారీ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసి విజయం సాధించాడు.పట్వారీగా ఉద్యోగం చేస్తూనే మాస్టర్స్ డిగ్రీ కూడా పొంది నెట్ ఉత్తీర్ణుడయ్యారు. రెండు సంవత్సరాలు చేశారు.
ఆ తర్వాత రాజస్థాన్ రాష్ట్రం నిర్వహించిన గ్రామ సేవక్ పరీక్షలో రెండో ర్యాంక్ సాధించారు. అయితే.. రాజస్థాన్ అసిస్టెంట్ ప్రిజన్ పరీక్షలో టాపర్ గా నిలిచాడు. దీంతో గ్రామ సేవక్‌గా చేరకూడదని నిర్ణయించుకున్నారు. అసిస్టెంట్ జైలర్‌గా చేరడానికి ముందు, రాజస్థాన్ పోలీస్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా కూడా ఎంపికయ్యారు.
అయితే అదే సమయంలో స్కూల్ టీచర్‌గా ప్రేమ్ ఎంపికయ్యేరు. దీంతో పోలీసు శాఖలో ఎస్‌ఐగా చేరలేదు. తరువాత.. NET పరీక్షలో ఉత్తీర్ణత సాధించి.. ఒక కాలేజీ లో లెక్చరర్ ఉద్యోగం పొందారు. కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తూనే.. మరోవైపు ప్రేమ్ సుఖ్ తన చదువును కొనసాగించి రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ కింద తహసీల్దార్ గా ఎంపికయ్యారు. తహసీల్దార్‌గా చేరిన తర్వాత యూపీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ కావడం మొదలు పెట్టారు. రెండో ప్రయత్నంలో యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత పొందారు. 2015లో AIR 170 సాధించి IPS అధికారి అయ్యారు ప్రేమ్ సుఖ్ దేలు. మొదటి పోస్టింగ్ గుజరాత్‌లోని అమ్రేలిలో ACPగా నియమింపబడ్డారు. జామ్‌నగర్ పోలీసు సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..