Salman Khan prison life: సీక్రెట్స్ రివీల్ చేసిన సల్లూ భాయ్.. జైల్లో అంత దారుణ పరిస్థితిని ఎదుర్కొన్నాడా..?

|

Dec 28, 2020 | 6:18 AM

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సంచలన విషయాన్ని వెల్లడించారు. ఇంతకాలం తన మనసులోనే దాచుకున్న నాటి దారుణ పరిస్థితిని ..

Salman Khan prison life: సీక్రెట్స్ రివీల్ చేసిన సల్లూ భాయ్.. జైల్లో అంత దారుణ పరిస్థితిని ఎదుర్కొన్నాడా..?
Follow us on

Salman Khan Prison Life: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సంచలన విషయాన్ని వెల్లడించారు. ఇంతకాలం తన మనసులోనే దాచుకున్న నాటి దారుణ పరిస్థితిని ఒక్కసారిగా రివీల్ చేసేశాడు. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. 1998లో జోధ్‌పూర్‌లో కంకణి అటవీ ప్రాంతంలో ‘హమ్ సాత్ సాత్ హైన్’ సినిమా చిత్రీకరణ సందర్భంగా రెండు కృష్ణ జింకలను వేటాడి చంపాడని సల్మాన్ ఖాన్‌పై ఆరోపణలు వచ్చాయి. ఆ క్రమంలో సల్మాన్ ఖాన్‌కు న్యాయస్థానం ఐదేళ్ల జైలు శిక్ష విధించివిషయం తెలిసిందే. సల్మాన్ కొంతకాలం జైలు జీవితం గడిపాడు కూడా. తాజాగా తన జైలు జీవితం గురించి సల్లూభాయ్ రివీల్ చేశాడు. ఒక మీడియా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనంతట తానుగానే ఈ విషయాన్ని బయటపెట్టారు.

సల్మా్న్ ఏం చెప్పారంటే.. ‘జైల్లోకి వెళ్లాన నా మైండ్ అంతా బ్లాంక్ అయిపోంది. అప్పటికీ గుండెనిబ్బరంతో ఉన్నాను. అయితే నా టెన్షన్ అంతా ఒక్కటే. అక్కడ తొమ్మిదో, పదో బ్యారక్‌లు ఉన్నాయి. ప్రతి బ్యారక్‌లో పదిమంది ఖైదీల వరకు ఉంటారు. అందరికీ కలిపి ఒకే బాత్‌రూమ్, ఒకే టాయ్‌లెట్ ఉంటుంది. ఒకరు వచ్చి భోజనం ఇచ్చి వెళతారు. ఒక మగ్గు ఇస్తారు. దాన్ని టీ తాగడానికి ఉపయోగించాలి, మంచి నీళ్లు తాగడానికి ఉపయోగించాలి, బాత్ రూమ్‌కు వెళ్లాలన్నా దాన్నే ఉపయోగించుకోవాలి. మనకు ఏ అవసరం వచ్చిన ఆ ఒక్కదాంతోనే చేసుకోవాల్సి ఉంటుంది’ అని తాను జైల్లో చూసిన గడ్డు పరిస్థితులను సల్మా్న్ ఖాన్ వెల్లడించాడు.

 

Also read:

Telangana Govt: ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం.. తెలంగాణలో మహిళా కమిషన్ ఏర్పాటు.. చైర్‌పర్సన్‌గా మాజీ మంత్రి..

2020 Round-up : 2020లో ఈ లోకాన్ని వీడి అభిమానులను శోకసంద్రంలోకి నెట్టిన సినీ తారలు..