Anant Ambani: ఆపదలో ఉన్న ఏనుగుకు ఆపద్బాంధవుడైన అనంత్ అంబానీ.. ఏకంగా 3,500 కి.మీ దూరం ప్రయాణం

|

May 12, 2024 | 4:59 PM

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీకి జంతువులపై ఎనలేని మక్కువ. జంతువుల సంరక్షణ కోసం తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ను కూడా నడుపుతున్నాడు. దాని పేరు వంటరా, దీని ద్వారా జంతువులకు సహాయం చేస్తారు. అప్పట్లో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది.

Anant Ambani: ఆపదలో ఉన్న ఏనుగుకు ఆపద్బాంధవుడైన అనంత్ అంబానీ.. ఏకంగా 3,500 కి.మీ దూరం ప్రయాణం
Anant Ambani
Follow us on

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీకి జంతువులపై ఎనలేని మక్కువ. జంతువుల సంరక్షణ కోసం తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ను కూడా నడుపుతున్నాడు. దాని పేరు వంటరా, దీని ద్వారా జంతువులకు సహాయం చేస్తారు. అప్పట్లో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. అనంత్ అంబానీ వైద్యుల బృందం దాదాపు 3,500 కిలోమీటర్ల దూరంలోని జామ్‌నగర్‌కు చేరుకుని అనారోగ్యంతో ఉన్న ఏనుగులకు సహాయం చేశారు.

ఏనుగుల సహాయానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో వైద్యుల బృందం అనారోగ్యంతో ఉన్న ఏనుగుకు, దాని బిడ్డకు చికిత్స చేశారు. ఈ వీడియో మోటివేషనల్ కోట్స్ అనే X ఖాతాలో షేర్ చేయడం జరిగింది. ఇది ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

త్రిపురలోని కైలాషహర్‌ ప్రాంతంలో ఒక ఏనుగు అనారోగ్యంతో బాధపడుతోంది. దాని కోసం అనంత్ అంబానీ నుండి సహాయం కోరింది. ఒక రోజులో, అనంత్ అంబానీ అనారోగ్యంతో ఉన్న ఏనుగుకు చికిత్స చేసే బాధ్యతను స్వీకరించారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌ నుంచి 3500 కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రిపురలోని కైలాషహర్‌కు వైద్యుల బృందాన్ని పంపారు. ఇక్కడ వైద్యులు అనారోగ్యంతో ఉన్న ఏనుగు, దాని బిడ్డను పరీక్షించారు. అనారోగ్యంతో ఉన్న ఏనుగుకు చికిత్స కూడా ప్రారంభించారు. వీడియోను షేర్ చేయడం ద్వారా, అనంత్ అంబానీ వైద్యుల బృందం 24 గంటల్లో గజరాజ్‌కి సేవ చేయడానికి జామ్‌నగర్‌కు 3500 కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రిపురకు చేరుకున్నట్లు తెలిపారు. దీన్నే అంటారు. నిజమైన సేవా భావం.

వంటారా ప్రాజెక్ట్ అంటే ఏమిటి?

అనంత్ అంబానీ ఏనుగుల సంరక్షణ కోసం వంటారా అనే ప్రాజెక్ట్‌ను నడుపుతున్నారు. వంటారా ప్రాజెక్ట్ గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న రిలయన్స్ కాంప్లెక్స్ సమీపంలో సుమారు 600 ఎకరాల్లో విస్తరించి ఉంది. అనారోగ్యంతో ఉన్న ఏనుగులను ఇక్కడ చూసుకుంటారు. ఇందుకోసం ఇక్కడ ప్రపంచ స్థాయి ఏర్పాట్లు కూడా చేశారు. ఇటీవల, ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కొన్ని చిత్రాలు కూడా రివీల్ చేశారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…