Finland: ఫిన్ లాండ్ ప్రజలు అంత హ్యాపీ ఎందుకబ్బా.. కారణాలు ఇవే..

ప్రతీ మనిషి సంతోషంగా జీవించాలనే కోరుకుంటారు. ఇందుకు ఆర్థిక పరిస్థితుల మొదలు, ఆరోగ్యం వరకు అన్నీ అంశాలు సహకరించాల్సి ఉంటుంది. ఇలా అన్నీ సక్రమంగా ఉండే దేశాలనే అత్యంత సంతోషకరమైన దేశాలుగా అభివర్ణిస్తుంటారు. ప్రతీ ఏటా యునైటెడ్‌ నేషన్‌ ప్రపంచంలో సంతోషకరమైన దేశాల జాబితాను విడుదల చేస్తుంటుంది...

Finland: ఫిన్ లాండ్ ప్రజలు అంత హ్యాపీ ఎందుకబ్బా.. కారణాలు ఇవే..
Finland
Follow us

|

Updated on: Mar 28, 2024 | 6:25 PM

ప్రతీ మనిషి సంతోషంగా జీవించాలనే కోరుకుంటారు. ఇందుకు ఆర్థిక పరిస్థితుల మొదలు, ఆరోగ్యం వరకు అన్నీ అంశాలు సహకరించాల్సి ఉంటుంది. ఇలా అన్నీ సక్రమంగా ఉండే దేశాలనే అత్యంత సంతోషకరమైన దేశాలుగా అభివర్ణిస్తుంటారు. ప్రతీ ఏటా యునైటెడ్‌ నేషన్‌ ప్రపంచంలో సంతోషకరమైన దేశాల జాబితాను విడుదల చేస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా వరల్డ్‌ హ్యాపీ డే సందర్భంగా మార్చి 20వ తేదీన సంతోషకరమైన దేశాల జాబితాను విడుదల చేసింది. ఇందులో మరోసారి ఫిన్‌లాండ్‌ అగ్ర స్థానంలో నిలిచింది. ఇంతకీ ఈ దేశ ప్రజలు ఇంత సంతోషంగా ఉండడానికి అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* ఒంటరిగా కాకుండా నలుగురితో సరదాగా గడిపితే సంతోషం సొంతమవుతుంది. దీనిని ఫిన్‌లాండ్‌ ప్రజలు తూచాతప్పకుండా పాటిస్తారు. ఇక్కడ ప్రజలు పరస్పరం సన్నిహిత సంబంధాలను కలిగి ఉంటారు. వీరు సంతోషంగా ఉండడానికి ఇది కూడా ఒక కారణంగా చెప్పొచ్చు.

* ఎక్కడైతే మంచి విద్య లభిస్తుందో అక్కడ స్వేచ్ఛ ఉంటుంది, అది సంతోషానికి దారి తీస్తుంది. ఫిన్‌లాండ్‌ ప్రజలు సంతోషంగా ఉండడానికి ఇక్కడి విద్యా విధానం కూడా ఒక కారణంగా చెప్పొచ్చు. ఇక్కడ ప్రీ స్కూల్‌ నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు ఉచిత విద్యను అందిస్తారు. మంచి విద్యతో చిన్నారుల్లో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది.

* ఇక సంతోషానికి మరో కారణం నాణ్యమైన వైద్యం. సరైన వైద్య సేవలు ఉంటే ప్రజలు సంతోషంగా ఉంటారు. ఫిన్‌లాండ్‌ ఈ విషయాన్ని పాటిస్తుంది. అందుకే ఈ దేశంలో అధిక నాణ్యతతో కూడిన వైద్య సేవలను అందిస్తారు.

* వృత్తితోపాటు, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్‌ చేసినప్పుడే సంతోషంగా ఉంటారనే విషయాన్ని ఫిన్‌లాండ్‌ పాటిస్తోంది. అందుకే ఈ దేశంలో ఉద్యోగులకు తక్కువ పని గంటలు అమలు చేస్తారు. దీంతో పనితో పాటు పర్సనల్‌ లైఫ్‌ను బ్యాలెన్స్‌ చేసుకోవడంతో అక్కడి ప్రజలు సంతోషంగా ఉంటున్నారు.

* మహిళలు ఆర్థికంగా బలంగా ఉన్న దేశాలు సాధారణంగానే అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. ఫిన్‌లాండ్‌లో మహిళా సాధికారితను ప్రోత్సహిస్తారు. అన్ని రంగాల్లో మహిళలకు సమన్యాయం ఉంటుంది.

* ఇక ఫిన్‌లాండ్‌లో ఆవిరి స్నానాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో శరీరానికి విశ్రాంతినివ్వడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా రక్షిస్తుంది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..