రామాయణ, మహాభారతాలలో ఈ తేడాలు ఎప్పుడైనా గమనించారా..! వింతగా అనిపిస్తాయి..

Ramayana, Mahabharat: మీరు టీవీలో రామాయణం, మహాభారత కథలను తప్పక చూసి ఉంటారు. ఈ రెండు కథల ద్వారా చాలా విషయాలు నేర్చుకోవచ్చు. కానీ

రామాయణ, మహాభారతాలలో ఈ తేడాలు ఎప్పుడైనా గమనించారా..! వింతగా అనిపిస్తాయి..
Ramayana
Follow us

|

Updated on: Nov 19, 2021 | 5:57 AM

Ramayana, Mahabharat: మీరు టీవీలో రామాయణం, మహాభారత కథలను తప్పక చూసి ఉంటారు. ఈ రెండు కథల ద్వారా చాలా విషయాలు నేర్చుకోవచ్చు. కానీ ఈ రెండు కథలు ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయని మీకు తెలుసా..! రామాయణం కర్తవ్యం గురించి అయితే మహాభారతం విప్లవం గురించి ఉంటుంది. రాముడు సంప్రదాయ నియమాలను పాటించాలని పోరాడుతాడు. కృష్ణుడు కొత్త నియమాలు ప్రారంభించడానికి కష్టపడతాడు. రాముడి పద్ధతుల వల్ల సీత వనవాసం చేయవలసి వస్తుంది. కృష్ణుడి ఆదేశాల మేరకు కురుక్షేత్ర యుద్దం జరగుతుంది.

రామాయణంలో రాముడు ప్రశ్నించకుండా తండ్రి ఆదేశాలను శిరసా పాటిస్తాడు. మహాభారతంలో కృష్ణుడి పూర్వీకుడు యదు తన తండ్రి ఆజ్ఞలను ధిక్కరిస్తాడు. రామాయణంలో రాముడు ఎప్పుడూ బంధువులను చంపలేదు. కానీ మహాభారతంలో కృష్ణుడు తన ఆరుగురు సోదరుల మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి మేనమామని చంపుతాడు. రామాయణంలో సామ్రాజ్య విభజన లేదు. మహాభారతంలో సామ్రాజ్యం పాండవులు, కౌరవుల మధ్య విభజించబడింది. రామాయణంలో రాముడు ఏకపత్నీవ్రతుడు. కానీ కృష్ణుడికి చాలా మంది గోపికలు ఉంటారు.

అంతేకాదు మహాభారతంలో ఐదుగురు సోదరులు ఒక్క స్త్రీని వివాహం చేసుకుంటారు. అందుకే ద్రౌపదిని పాంచాలి అంటారు. రామాయణంలో రాముడు తన భార్య సీతను రక్షించి రావణుడిని చెర నుంచి కాపాడుతాడు. మహాభారతంలో పాండవులు జూదంలో తమ భార్యను పోగొట్టుకుని నిస్సహాయులవుతారు. కౌరవుల చేతిలో ద్రౌపది అవమానించబడటం చూస్తారు. రామాయణంలో రావణుడితో జరిగిన యుద్ధంలో రాముడు ఎలాంటి చట్టాన్ని ఉల్లంఘించడు. మహాభారతంలో, కృష్ణుడి నాయకత్వంలో కౌరవులతో పోరాడుతున్న పాండవులు కొన్నిసార్లు నియమాలు, నిబంధనలను ఉల్లంఘిస్తారు.

Crime News: కేసు విచారిస్తుండగా జడ్జిపైనే దాడి చేసిన ఇద్దరు పోలీసులు.. ఎక్కడో తెలుసా..?

Crime News: గాలి నింపుతుండగా పేలిన ట్రాక్టర్‌ టైర్‌.. ఎగిరిపడిన బాలుడు.. విరిగిన చేతులు

Indian Railway: అలసిపోయిన ప్రయాణికుల కోసం కొత్త సేవలు.. విశ్రాంతి తీసుకోవడానికి వీటి ఏర్పాటు..

Latest Articles