PM kisan samman nidhi yojana: రైతులకు నేరుగా సేవలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కిసాన్ యోజన పథకం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకంలో చేరిన వారికి సంవత్సరానికి రూ.6 వేలు లభిస్తాయి. అయితే ఈ డబ్బులు ఒకేసారి కాకుండా.. విడతల వారీగా వారి అకౌంట్లలో వేయనుంది. ఇప్పటికే రైతులకు 7 విడుదల వారిగా నగదు జమచేసింది. ఇక 8వ విడత డబ్బులు మార్చి నెలలో వారి ఖాతాలలో జమచేయనుంది కేంద్రం. ఈ పథకంలో ఉన్న రైతులకు మనీ బెనిఫిట్ మాత్రమే కాకుండా మరిన్ని సేవలు అందుబాటులో ఉన్నాయి. అవెంటంటే. 1) కిసాన్ క్రెడిట్ కార్డ్, 2) కిసాన్ కార్డ్, 3) పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన.
1.) కిసాన్ క్రెడిట్ కార్డ్: పీఎం కిసాన్ యోజన రైతులకు కేంద్రం ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డులను అందజేయనున్నట్లు గతంలోనే ప్రకటించింది. వీటి ద్వారా రైతులకు తక్కువ వడ్డీకే రూ.3 లక్షల వరకు రుణం లభిస్తుంది. వడ్డీ రేటు 4 శాతం నుంచి ప్రారంభంకానుంది.
2.) కిసాన్ కార్డు: కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన పథకంలో ఉన్న రైతులకు ప్రత్యేకంగా ఫార్మర్ ఐడీ ఇవ్వాలనుకుంటున్నట్లు సమాచారం. ఈ కార్డులతో రైతులకు వారి భూములను కూడా లింక్ చేసుకోవచ్చు. దీంతో ప్రభుత్వాలు తీసుకువచ్చే స్కీంలలో రైతులకు నేరుగా ప్రయోజనం కలుగజేయనుంది.
3.) కిసాన్ మాన్ ధన్ యోజన: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో ఉన్న రైతులకు ఇవే కాకుండా మరోక బెనిఫిట్ కూడా ఉంది. అదే కిసాన్ మాన్ ధన్ యోజన. ఇందులో చేరిన రైతులకు రూ.6 వేల నుంచే నెలవారీ డబ్బులు కూడా కట్టోచ్చు. మరీ ఇంకెందుకు ఆలస్యం ఇన్ని బెనిఫిట్స్ ఉన్న పీఎం యోజన పథకంలో చేరి.. ప్రయోజనాలు పొందవచ్చు.
Also Read:
Stock Markets: స్టాక్ మార్కెట్లకు తగిలిన అమ్మకాల సెగ.. పడిపోతున్న సెన్సెక్స్.. నిఫ్టీ..