Phone call: ఐర్లాండ్ ఫేస్‌బుక్ ఆఫీస్ నుండి ఫోన్ కాల్.. ముంబైలో ప్రాణాలతో బయటపడ్డ యువకుడు..

|

Jan 05, 2021 | 2:28 PM

Phone call: ఐర్లాండ్ ఫేస్‌బుక్ హెడ్‌క్వార్టర్ అధికారుల అప్రమత్తతో ముంబైలో ఓ యువకుడి నిండు ప్రాణాలు నిలిచాయి. వారు చేసిన..

Phone call: ఐర్లాండ్ ఫేస్‌బుక్ ఆఫీస్ నుండి ఫోన్ కాల్.. ముంబైలో ప్రాణాలతో బయటపడ్డ యువకుడు..
Follow us on

Phone call: ఐర్లాండ్ ఫేస్‌బుక్ హెడ్‌క్వార్టర్ అధికారుల అప్రమత్తతో ముంబైలో ఓ యువకుడి నిండు ప్రాణాలు నిలిచాయి. వారు చేసిన ఒక్క ఫోన్ కాల్ అతన్ని ప్రాణాలతో ఉండేలా చేసింది. అసలేం జరిగిందంటే.. ముంబైకి చెందిన ఓ యువకుడు(23) ఫేస్‌బుక్‌ లైవ్ ఆన్ చేసి తాను చనిపోతున్నట్లు ప్రకటించాడు. దాంతో వెంటనే అప్రమత్తమైన ఫేస్‌బుక్ ఐర్లాండ్ హెడ్‌క్వార్టర్స్ ప్రతినిధులు ముంబై సైబర్ క్రైమ్ పోలీసులను అలర్ట్ చేశారు.

దాంతో ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు, ధుళే పోలీసులు అలర్ట్ అయ్యారు. యువకుడి ఫోన్ నెంబర్‌ ట్రేస్ చేసి అతని అడ్రస్ కనుక్కున్నారు. వెంటనే అతని ఇంటికి వెళ్లారు. అయితే అప్పటికే సదరు యువకుడు తన గొంతును కోసుకున్నాడు. కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న బాధిత యువకుడిని పోలీసులు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు.

Also read:

ISL 2020 21: హైదారాబాద్ ఆటగాళ్లు రెచ్చిపోతే ఇట్టా ఉంటది.. ఏకపక్ష విజయం..పాయింట్ల పట్టికలో…

Bigg Boss Sohel : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిసిన సోహెల్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో