PETROL PRICE: బడ్జెట్‌లో చమరు ధరలు పెరుగుతాయని అలా పేర్కొన్నారో లేదో ఇలా చమురు సంస్థలు ధరలు పెంచేస్తున్నాయి. ఫిబ్రవరి 4న దేశ వ్యాప్తంగా లీటర్, డీజిల్ ధరలు పెరిగాయి. ఢిల్లీలో పెట్రోల్ లీటర్‌కు రూ.86.65గా ఉంది. ఇక డీజిల్ ధర లీటర్‌కు రూ.76.83కు చేరింది. గత ఏడాది నుంచి ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ ధర సుమారు రూ.14 పెరిగింది.
తాజాగా పెరిగిన ధరల ప్రకారం హైదరాబాద్‌లో లీటర్ ధర రూ.90.10, డీజిల్ రూ.83.81కు చేరాయి. ముంబైలో పెట్రోల్ రూ.93.20, డీజిల్ రూ.83.73గా నమోదైంది. కోల్‌కతాలో పెట్రోల్ రూ.88.01, డీజిల్ రూ.80.41, చెన్నైలో పెట్రోల్ రూ.89.13, డీజిల్ రూ.82.04 గా ఉంది. బెంగళూరులో పెట్రోల్ ధర లీటర్ కు రూ.89.54గా… డీజిల్ రూ.81.44గా నమోదైంది. నోయిడాలో పెట్రోల్ రూ.85.91, రూ.77.24, గురుగ్రామ్‌లో పెట్రోల్ రూ.84.72, డీజిల్ రూ.77.39కు చేరాయి.
Also Read: Chicken Price Down: ఢమాల్.. ఢమాల్.. మరింత పడిపోయిన చికెన్ ధరలు.. కేజీ రేటు ఎంతో తెలుసా..?