PETA: వారితో శృంగారం వద్దు.. మహిళలకు ‘పెటా’ పిలుపు.. నెట్టింట పేలుతున్న పంచ్‌లు..

|

Sep 28, 2022 | 9:58 AM

ప్రపంచాన్ని పరిరక్షించేందుకు.. మూగజీవాల హక్కుల పరిరక్షక సంస్థ(పెటా) ఓ ప్రచారం మొదలుపెట్టింది. ఇక దానిపై సోషల్ మీడియాలో పంచ్‌లు పేలుతున్నాయి.

PETA: వారితో శృంగారం వద్దు.. మహిళలకు పెటా పిలుపు.. నెట్టింట పేలుతున్న పంచ్‌లు..
Peta Campaign For Save Worl
Follow us on

ప్రపంచాన్ని రక్షించడం గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా.? మీ దగ్గర ఉన్న ప్లాన్స్ ఏంటి.? చెట్లు నాటడం, కార్బన్ ఉద్గారాలను తగ్గించండి, ‘సేవ్ సోయిల్’ అంటూ క్యాంపెయిన్ చేయడం లాంటి అంశాలు మీకు మొదటిగా మనస్సులో మెదలవచ్చు. అయితే మీరెప్పుడైనా సెక్స్ స్ట్రైక్ గురించి ఆలోచించారా.? ఏంటి అర్ధం లేకుండా మాట్లాడుతున్నామని అనుకుంటున్నారా.! ఆగండీ.. ఆగండీ.! అప్పుడే మీరు ఒక కన్‌క్లూజన్‌కు రావద్దు. పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్(PETA) జర్మనీ విభాగం.. మహిళాలోకానికి ఓ పిలుపునిచ్చింది. సెక్స్ స్ట్రైక్‌కు వెళ్లాలని.. నాన్ వెజ్ తినే మగవారితో శృంగారంలో పాల్గొనకూడదని చెప్పింది. సెప్టెంబర్ 22వ తేదీన తన బ్లాగ్‌లో రాసుకొచ్చింది. ఇక ఇది కాస్తా బెడిసికొట్టింది. నెట్టింట తెగ పంచ్‌లు పేలుతున్నాయి.

కొందరి మగవారికి ముక్క లేకుండా ముద్ద దిగదు. అలాంటి వారి వల్ల మూగజీవాలకు మాత్రమే కాదు.. భూమికి కూడా హాని కలుగుతుంది. ‘మహిళల కంటే మాంసం ఎక్కువగా తినే మగవారు పర్యావరణ కాలుష్యానికి 41 శాతం కారణం అవుతున్నారు. దీని వల్ల మహిళలు సెక్స్ స్ట్రైక్ చేయాలని.. తద్వారా వారిని శాఖాహారులుగా మార్చాలని మూగజీవాల హక్కుల పరిరక్షక సంస్థ(పెటా) పిలుపునిచ్చింది.

కాగా, సోషల్ మీడియా వేదికగా పెటా ఇచ్చిన ఈ పిలుపునకు పంచ్‌లు, సెటైర్లు పేలుతున్నాయి. పెటా ప్రచారంలో ఏమాత్రం వాస్తవికత లేదంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ‘మాంసం తింటున్న మగవారితో సెక్స్ వద్దంటే.. మరి మాంసం తినే ఆడవారి సంగతేంటి’ అంటూ ఇంకొందరు సైటర్లు వేస్తున్నారు.