
ఇటీవలి కాలంలో ఆప్టికల్ ఇల్యూషన్లు, ఇతర పజిల్ చిత్రాలు బాగా ప్రాచుర్యం పొందాయి. మన కళ్లు, మెదడుకు పని ఇచ్చే ఇలాంటి ఫోటోలు తరచూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. ఇలాంటి ఫజిల్ చిత్రాలను సాల్వ్ చేసేందుకు చాలా మంది ఇష్టపడుతారు. అందుకే వారికి సమయం దోరికినప్పుడల్లా వీటిని సాల్వ్ చేసేందుకు ప్రయత్నిస్తారు. మీకు కూడా ఇలాంటి ఫజిల్ చిత్రాలను సాల్వ్ చేసే అలవాటు ఉంటే.. మీకు ఒక సవాల్ ఉంది. ఈ చిత్రంలో, తాబేళ్ల మధ్య ఒక పాము దాగి ఉంది. దాన్ని మీ ఏకాగ్రత, పరిశీలన నైపుణ్యాలను ఉపయోగించి మీరు 10 సెకన్లలో కనిపెట్టాలి.
రెడ్డిట్‌లో షేర్ చేయబడిన ఈ అప్టికల్ ఇల్యూషన్ చిత్రం మిమ్మల్ని కాస్త గందరగోళానికి గురిచేయవచ్చు. ఎందుకంటే ఈ చిత్రాన్ని మీరు మొదటగా చూసినప్పుడు అందులో మీకు కేవలం తాబేళ్లు మాత్రమే కనిపిస్తాయి. కానీ ఈ తాబేళ్ల మధ్యలో ఒక పాము కూడా దాడి ఉంది. కాబట్టి మీరు ఈ సవాల్‌ను స్వీకరిస్తునట్లయితే మీ పరిశీలన నైపుణ్యాలను ఉపయోగించి తాబేళ్ల మధ్యలో ఉన్న పామును పది సెకన్లలో కనుగొనండి.
మీరు ఈ చిత్రంలోని దాగి ఉన్న పామును కనిపెట్టారా? అభినందనలు. ఒక వేళ మీరు ఈ చిత్రాన్ని గుర్తించకపోయినా ఏం పర్లేదు. సమాధానం మేము ఇక్కడ ఉంచాము. ఈ చిత్రం యొక్క ఎడమ వైపున పాము ఉంది. మీరు ఈ పామును నాలుగు తాబేళ్ల పైన దిగువ నుండి కనుగొనవచ్చు. మీరు కళ్ళు మూసుకుని ఈ చిత్రాన్ని చూస్తే, మీకు పాము కనిపిస్తుంది.
Optical Illusion Snake
మరిన్ని హ్యూమన్ ఇన్‌ట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి