Name Astrology: మీ పేరును బట్టి.. మీరెంత రొమాంటిక్ అనేది ఇట్టే చెప్పేయోచ్చు.. ఇందులో మీరున్నారో చూసుకోండి

|

Sep 12, 2022 | 8:20 AM

మీ పుట్టిన తేదీ, మీ పేరు, మీ పేరులోని మొదటి అక్షరం ఇలా ప్రతిదీ మీ వ్యక్తిత్వాన్ని మెరుగు పరిచేదిగా ఉంటుంది. అంతే కాదు ఓ గుర్తింపును..

Name Astrology: మీ పేరును బట్టి.. మీరెంత రొమాంటిక్ అనేది ఇట్టే చెప్పేయోచ్చు.. ఇందులో మీరున్నారో చూసుకోండి
Astro
Follow us on

జ్యోతిష్యం, సంఖ్యా శాస్త్రం.. ఇలా మన వ్యక్తిత్వాన్ని తెలుసుకోవడానికి సహాయపడతాయి. మీ పుట్టిన తేదీ, మీ పేరు, మీ పేరులోని మొదటి అక్షరం ఇలా ప్రతిదీ మీ వ్యక్తిత్వాన్ని మెరుగు పరిచేదిగా ఉంటుంది. అంతే కాదు ఓ గుర్తింపును తీసుకొస్తాయి. మీ పేరులోని అక్షరం ఆధారంగా మన జీవితం ఎలా ఉంటుందో కొంత వరకు అంచనా వేయవచ్చు. ఇందులో పేరులోని మొదటి అక్షరం నుంచే వ్యక్తి వ్యక్తిత్వం, భవిష్యత్తు గురించి చాలా తెలుసుకోవచ్చు. ఇందులో పేరులోని మొదటి అక్షరంలో ఏముందో తెలుస్తుంది. ముందుగా కొన్ని A, K, T, P, S, R, V , Y అనే అక్షరాలతో పేర్లు ప్రారంభమయ్యే వ్యక్తుల లక్షణాల గురించి ఈ రోజు మనకు తెలుసుకుందాం..

Y తో మొదలయ్యే పేరు: Y తో పేరు మొదలయ్యే వ్యక్తులు చాలా అహంభావంతో ఉంటారు. విజయాన్ని పొందడానికి.. దూకుడుగా ఉంటారు. విజయం సాధించిన తర్వాత మాత్రమే వారు తమ ఊపిరి పీల్చుకుంటారు. ప్రేమ వివాహాల విషయంలో చాలా దూరంగా ఉంటారు.

V అక్షరంతో పేర్లు: V తో మొదలయ్యే వ్యక్తులు చాలా ఉల్లాసంగా ఉంటారు. ఈ వ్యక్తులు చాలా శృంగారభరితంగా ఉంటారు. వారి భాగస్వామి పట్ల చాలా ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. వీరి మనసులోని మాటలను, మనసును తెలుసు కోవడం కొద్దిగా కష్టంగా ఉంటుంది.

S అనే పేరు ఉన్న వ్యక్తులు: S తో మొదలయ్యే వ్యక్తులు చాలా కష్టపడి పనిచేసేవారు. తెలివైనవారు. వారు స్వచ్ఛమైన హృదయం కలిగి ఉంటారు. విజయం కోసం అహర్నిషలు కష్టపడుతారు. విజయం సాధించే వరకు నిద్రపోరు. అంతే కాదు ప్రజల మధ్య ఉండేందుకు ఇష్టపడుతారు. సామన్య ప్రజలకు వెన్నంటి ఉంటూ.. వారికి సహాయం చేస్తారు. కానీ వారి సంభాషణ శైలి వారి ఇమేజ్‌ను మెరుగు పరుస్తుంది. వీరు చాలా శృంగారభరితంగా ఉంటారు. విలాసవంతమైన జీవితాన్ని ఇష్టపడతారు.

పేరు Rతో: ఈ వ్యక్తులు కొంచెం అంతర్ముఖులు. కానీ బబ్లీ నేచర్ వల్ల జనాలకు అభిమానులుగా మారుతారు. ఈ వ్యక్తులు తమ జీవిత భాగస్వామి సంతోషం కోసం ఎంతకైనా తెగిస్తారు.

P పేరు ఉన్న వ్యక్తులు: P తో మొదలయ్యే వ్యక్తులు నిజాయితీగా ఉంటారు. వీరు చాలా కళాత్మకంగా ఉంటారు. ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. వారు తమ భాగస్వామిని కూడా ఎప్పుడూ సంతోషంగా ఉంచుతారు. వారి అదృష్టం వారికి చాలా అనుకూలంగా ఉంటుంది.

T పేరుతో ఉన్న వ్యక్తులు: T తో మొదలయ్యే వ్యక్తులు చాలా మొండిగా ఉంటారు. అతను ఎప్పుడూ గంభీరంగా కనిపిస్తారు. అరుదుగా నవ్వుతారు. వీరు తమ కుటుంబాన్ని చాలా ప్రేమిస్తారు. ఎల్లప్పుడూ మంచి విషయాల వైపు ఆకర్షితులవుతారు. వీరు తమ భాగస్వామిని హృదయపూర్వకంగా ప్రేమిస్తారు. వీరి భాగస్వామి నుంచి అలాంటి ప్రేమనే ఆశిస్తుంటారు.

K పేరుతో: K తో ప్రారంభమయ్యే వ్యక్తులు ఉల్లాసంగా ఉంటారు. వీరు తరచుగా నవ్వుతూ కనిపిస్తారు. వీరి జీవితంలో చాలా ఆనందాన్ని కూడా పొందుతారు. వారి వ్యక్తిత్వంలో అద్భుతమైన ఆకర్షణ ఉంది. వీరు ఇతరులకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు.

A పేరు ఉన్నవారు: A తో ప్రారంభమయ్యే వ్యక్తులు చాలా కష్టపడి పనిచేసేవారు. సహనం చేసే వ్యక్తులుగా పేరు తెచ్చుకుంటారు. వంకరగా మాట్లాడే బదులు చేదు నిజాన్ని సూటిగా మాట్లాడడానికే ఇష్టపడతాడు. వీరు వ్యక్తిగత, వృత్తి జీవితంలో తమ అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేస్తారు. ఇలా మాట్లాడటం వల్ల వీరికి శత్రువుల అధికంగా ఏర్పడుతారు.

మరిన్ని హ్యూమయన్ ఇంట్రెస్టెడ్ న్యూస్ కోసం..