Viral Video: తన కూతురు కోసం ఈ తల్లి ఏం చేసిందో చూడండి… కంటతడి పెట్టిస్తోన్న వీడియో..

|

Jan 28, 2021 | 5:31 PM

Mom shaves her head to support daughter: ‘ఆడ తనం దేశానికి ఒక్కోలా ఉండొచ్చు... కానీ అమ్మ తనం మాత్రం ఎక్కడైనా ఒకేలా ఉంటుంది’ ఇది ఓ తెలుగు సినిమాలోని డైలాగ్. నిజమే ఈ ప్రపంచంలో ఏ తల్లైనా సరే...

Viral Video: తన కూతురు కోసం ఈ తల్లి ఏం చేసిందో చూడండి... కంటతడి పెట్టిస్తోన్న వీడియో..
Follow us on

Mom shaves her head to support daughter: ‘ఆడ తనం దేశానికి ఒక్కోలా ఉండొచ్చు… కానీ అమ్మ తనం మాత్రం ఎక్కడైనా ఒకేలా ఉంటుంది’ ఇది ఓ తెలుగు సినిమాలోని డైలాగ్. నిజమే ఈ ప్రపంచంలో ఏ తల్లైనా సరే ఒకేలా ఆలోచిస్తుంది. తన పిల్లల కోసమే పరితిపిస్తుంది. తమ పిల్లలు పడే బాధలను చూస్తూ భరించడం తల్లి హృద‌యానికి చాలా కష్టం. వీలైతే పిల్లల కష్టాల్ని తాను భరించడానికి సిద్ధమవుతుంది అమ్మ. తాజాగా ఇంటర్‌నెట్‌లో వైరల్ అవుతోన్న ఓ వీడియో ఇదే విషయాన్ని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది.
వివరాల్లోకి వెళితే.. పోర్చుగీసుకు చెందిన లూసియానా అనే యువతి క్యాన్సర్‌‌తో బాధపడుతోంది. దీంతో ట్రీట్‌మెంట్‌లో భాగంగా జుట్టు కత్తిరించాల్సి వచ్చింది. ఈ పనిని ఆ యువతి తల్లే చేపట్టింది. అయితే ఎంతైనా తల్లి హృద‌యం కదా.. తనముందే కూతురు అలా మారడం చూసి తట్టుకోలేని ఆ అమ్మ.. తన జుట్టును కూడా షేవ్ చేసుకోవడం ప్రారంభించింది. తల్లి జుట్టు కత్తిరించుకుంటుండగా ఆ కూతురు భావోద్వేగంతో కన్నీటీ పర్యంతమైంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. కూతురు కష్టంలో తనూ భాగస్వామి అవుతూ తల్లి చేసిన పనికి నెటిజెన్లు ఫిదా అవుతున్నారు. ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే లక్షల మంది వీక్షించడం విశేషం.

Also Read: 4 Chinese Men Eat Oranges: లగేజీ ఫీ కట్టాల్సి వస్తుందని.. 30కేజీల నారింజపండ్లను 30. నిమిషాల్లో తిన్న నలుగురు వ్యక్తులు