Andhra Pradesh: మూడో పెళ్లి చేసుకున్న ఎమ్మెల్సీ.. సాక్షి సంతకం పెట్టిన రెండో భార్య.. వీడియో చూశారా?

| Edited By: Ravi Kiran

Nov 28, 2023 | 1:31 PM

ఇప్పటి వరకు కొన్ని చోట్ల కట్టుకున్న భర్త మరో వివాహం చేసుకుంటే భార్య దీనికి సహకరించిన ఎన్నో ఘటనలు విన్నాం, ఇప్పుడు తాజాగా ఓ ఎమ్మెల్సీ జీవితంలో అలాంటి ఘటనే పునరావృతమైంది. కైకలూరు కు చెందిన ఎమ్మెల్సీ జయ మంగళ వెంకటరమణ మూడో వివాహం చేసుకున్నారు. ఏలూరు రేంజ్ అటవీ శాఖలో సెక్షన్ ఆఫీసర్ గా పని చేస్తున్న సుజాతను కైకలూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో వివాహం చేసుకున్నారు ఎమ్మెల్సీ.

Andhra Pradesh: మూడో పెళ్లి చేసుకున్న ఎమ్మెల్సీ.. సాక్షి సంతకం పెట్టిన రెండో భార్య.. వీడియో చూశారా?
Mlc Jayamangala Marriage
Follow us on

ఇప్పటి వరకు కట్టుకున్న భర్త మరో వివాహం చేసుకుంటే భార్య దీనికి సహకరించిన ఎన్నో ఘటనలు విన్నాం. అలాగే భార్యను ప్రియుడితో పెళ్లి చేసి పంపించిన భర్తల గురించ విన్నాం. అయితే  వివాహం ప్రస్తుతం ఏలూరు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆ ఎమ్మెల్సీ చేసుకున్నది మూడో వివాహం కావడం ఇందుకు ఒక కారణం అయితే మరో కారణం ఆయన నుంచి చట్టబద్ధం గా విడిపోయిన రెండో భార్య ఆ వివాహానికి సాక్షిగా సంతకం చేయడం. ఇదే ఘటన ఇప్పుడు జిల్లాలో మరింత చర్చనీయాంశంగా మారింది.  ఇప్పుడు తాజాగా ఓ ఎమ్మెల్సీ జీవితంలో అలాంటి ఘటనే పునరావృతమైంది. కైకలూరు కు చెందిన ఎమ్మెల్సీ జయ మంగళ వెంకటరమణ మూడో వివాహం చేసుకున్నారు. ఏలూరు రేంజ్ అటవీ శాఖలో సెక్షన్ ఆఫీసర్ గా పని చేస్తున్న సుజాతను ఎమ్మెల్సీ జయ మంగళ వెంకటరమణ కైకలూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో వివాహం చేసుకున్నారు. జయ మంగళ వెంకటరమణ గతంలో టీడీపీ తరఫున కైకలూరు ఎమ్మెల్యేగా పనిచేశారు. కొన్ని అనూహ్య పరిణామాల నేపథ్యంలో కైకలూరు టీడీపీ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న ఆయన కొన్ని నెలల క్రిందట వైసీపీలో చేరి ఎమ్మెల్సీ అయ్యారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఆయన మూడో వివాహం చేసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. ఎమ్మెల్సీ జయ మంగళ వెంకటరమణ ముందుగా మణి అనే మహిళతో మొదటి వివాహం జరిగింది. మొదటి భార్యకు ఒక కుమార్తె ఉంది. అయితే అనారోగ్య కారణాలవల్ల మొదటి భార్య మణి మృతి చెందడంతో సునీత అనే మహిళను ఆయన రెండవ వివాహం చేసుకున్నారు. అయితే రెండో భార్య సునీతకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కొన్నేళ్ల క్రితం రెండవ భార్య సునీతతో మనస్పర్థలు, కుటుంబ గొడవలు కారణంగా ఆయన ఆమె నుంచి విడాకులు తీసుకున్నారు.

ఇదిలా ఉంటే ఏలూరు అటవీ సెక్షన్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న సుజాతను ఆయన తాజాగా కైకలూరు సబ్ రిజిస్టర్ ఆఫీసులో మూడో వివాహం చేసుకున్నాను. అయితే సుజాతకు ఇది రెండవ వివాహం. సుజాత మొదటి భర్త అనారోగ్య కారణాల చేత చనిపోయారు. మొదటి భర్త ద్వారా ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇదిలా ఉంటే సబ్ రిజిస్టర్ ఆఫీసులో జరిగిన జయమంగళ వెంకటరమణ, సుజాతల వివాహానికి జయ మంగళ వెంకటరమణ రెండవ భార్య సునీత సాక్షి సంతకం చేయడం గమనార్హం. అంతేకాకుండా ఆమె సమక్షంలోనే వారిద్దరూ ఒకటి సంబంధిత వారి వివాహ నమోదు సర్టిఫికెట్ను అందుకున్నారు.. అంతేకాక అందరూ కలిసి ఒకే ఫోటోలకు సైతం ఫోజులివ్వడంతో ఎమ్మెల్సీ మూడో వివాహం హాట్ టాపిక్ గా మారింది.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.