గుంటూరు పక్కనే ఉన్న పల్లెటూరు లాలుపురం. ఇప్పుడది పల్లెటూరులా లేదు. నగరంలోనే కలిపిసోయింది. ఈ గ్రామం నుండి బీటెక్ చదవిన పుష్పలత టిసిఎస్ లో ఉద్యోగం సంపాదించారు. కొద్దీ రోజుల పాటు హైదరాబాద్‌లో కంపెనీలోనే పనిచేశారు. అయితే ఒక ప్రాజెక్ట్ కోసం ఆమె బెల్జియం వెళ్లాల్సి వచ్చింది. అక్కడ క్రిష్ అనే యువకుడితో కలిసి పనిచేయాల్సి వచ్చింది. ఇంతవరకూ బాగానే ఉంది. ఇద్దరూ కలిసి ఒకే ప్రాజెక్ట్ లో పనిచేశారు. మొదట పరిచయం కాస్తా స్నేహంగా మారింది. ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత వీరిద్దరూ ఎవరి దారిన వారు వెళ్లిపోయారు.
అప్పటి వరకూ అంతా బాగానే ఉన్న ఆతర్వాతే ఇద్దరికి తెలిసింది.. స్నేహంగా మారిన పరిచయం ప్రేమగా మొగ్గ తొడిగిందని.. మొదట పుష్పలత తన ప్రేమ విషయాన్ని క్రిష్ కు తెలియజేసింది. అంతేకాదు వారి బంధువులకు కూడా చెప్పింది. క్రిష్ పెళ్లి చేసుకుని వివాహ జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. క్రిష్ ఒకే అన్నా వారి బంధువుల అనుమతి కోసం వీరిద్దరూ వేచి చూశారు. ఇద్దరి అభిప్రాయాలు, ఆలోచనలు ఒకటే అని తెలుసుకున్న తర్వాత క్రిష్ బంధువులు కూడా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.
అయితే పెళ్లి ఎక్కడా చేయాలన్న మీమాంసలో పడ్డారు ఇరువురి కుటుంబాలు. అప్పడే క్రిష్ బంధువులు అమ్మాయి సాంప్రదాయం ప్రకారమే వివాహం జరపాలని నిర్ణయించారు. తెలుగింటి వివాహ పద్దతులను తెలుసుకున్న వారు కచ్చితంగా వివాహాన్ని తెలుగింటి సాంప్రాదాయంలో చేయాలనుకున్నారు. అనుకన్నదే తడువుగా ముందుగా అబ్బాయి అతని తల్లిదండ్రులు మరొక ఇరవై ఐదు మంది బంధువులు లాలుపురం వచ్చారు. అక్కడే ఉన్న ఒక ఫంక్షన్ హాల్ లో దిగారు. మేళతాళాలు, మంగళవాయిద్యాలు. మంత్రోచ్చారణలు మధ్య క్రిష్, పుష్పలత పరిణయం అంగరంగవైభవంగా జరిగింది. యూరప్ ఖండం నుండి వచ్చిన క్రిష్ బంధువులు తెలుగింటి సాంప్రాదాయ వస్త్రాల్లో మెరిసిపోయారు. ఇటు లాలుపురం వాసులు తెల్లవాళ్లను తెలుగింటి దుస్తుల్లో చూసి మురిసి పోయారు. మొత్తానికి లాలుపురం అమ్మాయి. బెల్జియం ఇంటి కోడలు కావటాన్ని ఆ ఊరి వాసులు ఘనంగా చెప్పుకుంటున్నారు.
మరిన్ని హ్యమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…