News Paper: న్యూస్‌ పేపర్‌ చివర్లో ఈ నాలుగు రంగులు ఎందుకు ఉంటాయో తెలుసా.? పెద్ద కారణమే ఉందడోయ్‌..

|

Oct 15, 2022 | 11:07 AM

ఏ వార్త పత్రికలను గమనించినా చివర్లో నాలుగు రంగులు కనిపిస్తుంటాయి. ప్రతీ పేజీలో ఈ రంగులు తప్పనిసరిగా ఉంటాయి. చాలా మంది న్యూస్‌ పేపర్‌ చదివినా ఎప్పుడూ ఆ రంగులు ఏంటని ఆలోచించి ఉండరు. అయితే ఏ కారణం లేకుండా వాటిని ఎందుకు ప్రింట్ చేస్తారనే అనుమానం రాకమానదు..

News Paper: న్యూస్‌ పేపర్‌ చివర్లో ఈ నాలుగు రంగులు ఎందుకు ఉంటాయో తెలుసా.? పెద్ద కారణమే ఉందడోయ్‌..
Fact
Follow us on

ఏ వార్త పత్రికలను గమనించినా చివర్లో నాలుగు రంగులు కనిపిస్తుంటాయి. ప్రతీ పేజీలో ఈ రంగులు తప్పనిసరిగా ఉంటాయి. చాలా మంది న్యూస్‌ పేపర్‌ చదివినా ఎప్పుడూ ఆ రంగులు ఏంటని ఆలోచించి ఉండరు. అయితే ఏ కారణం లేకుండా వాటిని ఎందుకు ప్రింట్ చేస్తారనే అనుమానం రాకమానదు. దీనివెనకాల పెద్ద కారణమే ఉంది. ఇంతకీ న్యూస్‌ పేపర్‌లో ఇలా ఎందుకు ప్రింట్‌ చేస్తారో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

పేపర్‌లో కింద ఉండే నాలుగు రంగులను CMYK అంటారు. ఇందులో C అంటే సియాన్‌ (నీలం), M అంటే మెజెంటా (పింక్‌), Y అంటే యొల్లో, K అంటే నలుపు రంగుతో సూచిస్తారు. ఈ నాలుగింటినీ ప్రింటింగ్‌ పరిభాషలో ప్రాథమికగా రంగులుగా చెబుతారు. ఈ కలర్స్‌ కాంబినేషన్‌ ఆధారంగానే మనకు కావాల్సిన కొత్త రంగు వస్తుంది. ఇక పేపర్‌ ప్రింట్‌ చేసేసమయంలో ఈ నాలుగు రంగులకు సంబంధించిన ప్లేట్స్‌ను అమరుస్తారు. ఈ ప్లేట్స్‌ కేటాయించిన స్థలం నుంచి పక్కకు జరిగితే ప్రింటింగ్‌లో అక్షరాలు, ఫొటోలు సరిగ్గా ప్రింట్ అవ్వవు.

మరి ప్రింటింగ్ అవుతోన్న ప్రతీ పేపర్‌ను ఓపెన్‌ చేసిన సరిగ్గా ప్రింట్ అవుతుందో లేదో చూడలేం కదా. అందుకే పేపర్‌కి చివర్లో ఉండే ఈ నాలుగు రంగులను అక్కడక్కడ చెక్‌ చేస్తుంటారు. ఒక వేళ ఈ నాలుగు రంగులు సరిగ్గా ప్రింట్‌ కాకుండా ఏమైనా బ్లర్‌ వస్తే వెంటనే అలర్ట్‌ అయి సదరు కలర్‌ ప్లేట్స్‌ను సెట్‌ చేసి మళ్లీ ప్రింటింగ్ ప్రారంభిస్తారు. చూశారుగా పేపర్‌లో కనిపించే రంగుల వెనకాల అసలు కథ ఇదన్నమాట.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..