Dubai: దుబాయ్‌లో పెట్రోల్‌ ధర తక్కువే.. కానీ వీటి ధర తెలిస్తే వామ్మో అంటారు..

|

Nov 12, 2021 | 9:28 PM

Dubai: భారత్‌లో రోజు రోజుకు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న సంగతి అందరికి తెలిసిందే. ఇంధన ధరలు పెరిగినప్పుడల్లా ప్రజలు తక్కువ రేటు ఉన్న దేశాల గురించి చర్చిస్తారు.

Dubai: దుబాయ్‌లో పెట్రోల్‌ ధర తక్కువే.. కానీ వీటి ధర తెలిస్తే వామ్మో అంటారు..
Dubai
Follow us on

Dubai: భారత్‌లో రోజు రోజుకు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న సంగతి అందరికి తెలిసిందే. ఇంధన ధరలు పెరిగినప్పుడల్లా ప్రజలు తక్కువ రేటు ఉన్న దేశాల గురించి చర్చిస్తారు. ఈ దేశాల్లో దుబాయ్ కూడా ఒకటి. ఇక్కడ పెట్రోల్ ధరలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ, రోజువారీ వినియోగించే వస్తువుల రేట్లు అధికంగా ఉంటాయి. అసలు దుబాయ్‌లో ఎటువంటి పరిస్థితులు ఉంటాయి. సామన్యులు నివసించాలంటే ఎంత ఖర్చవుతుంది తదితర విషయాలు తెలుసుకుందాం.

పెట్రోలు మినహాయించి మిగతావాటి ధరలు
ఇక్కడ పెట్రోల్ రేటు మాత్రమే తక్కువగా ఉంటుంది. ఇతర వస్తువుల ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి. అనేక నివేదికల ప్రకారం.. దుబాయ్‌లో నిత్యావసర వస్తువులు ఢిల్లీ కంటే 128 శాతం అధిక ధరలు కలిగి ఉంటాయి. నలుగురు వ్యక్తుల కుటుంబానికి నెలకు రెండున్నర లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది కాకుండా ఒక్క వ్యక్తి అద్దెకు 70 వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అదే సమయంలో దుబాయ్‌లో ఛార్జీలు ఢిల్లీ కంటే చాలా ఖరీదైనవి దాదాపుగా 400 శాతం వరకు ఎక్కువ.

పర్యాటకులకు ఎంత ఖరీదు..
ఎవరైనా అక్కడ మంచి రెస్టారెంట్‌కి వెళితే కనీసం 35 దిర్హామ్‌లు ఖర్చు అవుతుంది. ఇది కాకుండా, బీరుకు 46 దిర్హమ్‌లు, కోక్-పెప్సికి 4 దిర్హమ్‌లు. నీటి బాటిల్ ధర 1.61 దిర్హామ్‌లు ఉంటాయి. దుబాయ్‌లో ఒక దిర్హామ్ సుమారు 20 రూపాయలకు సమానం. ఒక వస్తువును కొనుగోలు చేయడానికి ఎన్ని దిర్హమ్‌లు ఖర్చ చేయాల్సి ఉంటుందో వాటిని 20తో గుణిస్తే తెలుస్తుంది. దీంతో అక్కడ ఉండాలంటే చాలా ఖర్చు అవుతుందని మీరు అర్థం చేసుకోవచ్చు.

RBI రూ.1,2,5,10,20 కాయిన్స్‌ మాత్రమే కాకుండా 75,150,250 కాయిన్స్ కూడా అచ్చేసింది.. వీటిని ఎలా పొందాలో తెలుసా..?

పాత నోట్లే కదా అని పక్కకు పడేస్తున్నారా..! ఇప్పుడు అవే సిరులు కురిపిస్తున్నాయి ఎలాగంటే..?

ఈ ద్వీపం మహిళలకు మాత్రమే.. వివాహం నుంచి అంత్యక్రియల వరకు అన్నీ వారే.. ఎందుకో తెలుసా..?