Railway Rules: రైల్వే చట్టాల గురించి మీకు తెలుసా.! కారణం లేకుండా ట్రైన్ ఆపితే ఎన్నేళ్ల జైలు శిక్ష.?

|

Oct 18, 2021 | 6:13 PM

మనం తరచూ ట్రైన్స్‌లో ప్రయాణం చేస్తుంటాం. ఐ‌ఆర్‌సీటీసీ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా ట్రైన్ టికెట్లు ఎలా కొనుగోలు చేసుకోవాలి.?

Railway Rules: రైల్వే చట్టాల గురించి మీకు తెలుసా.! కారణం లేకుండా ట్రైన్ ఆపితే ఎన్నేళ్ల జైలు శిక్ష.?
Train
Follow us on

మనం తరచూ ట్రైన్స్‌లో ప్రయాణం చేస్తుంటాం. ఐ‌ఆర్‌సీటీసీ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా ట్రైన్ టికెట్లు ఎలా కొనుగోలు చేసుకోవాలి.? ప్లాట్‌ఫార్మ్‌లు ఎలా చెక్ చేసుకోవాలి.? మనం ప్రయాణించే ట్రైన్ నెంబర్ ఏంటి.? ఇలా అనేక విషయాలను మనం తెలుసుకుంటూ ఉంటాం. అయితే మీరెప్పుడైనా రైల్వే చట్టాల గురించి తెలుసుకున్నారా.? రైల్ రోకో అంటూ నిరసనకారులు ఆందోళన చేస్తూ రైలు నిలిపివేస్తే.. అది రైల్వే నిబంధనలకు విరుద్దమా.? ఎన్నేళ్లు జైలు శిక్ష పడుతుంది.! అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

రైల్వే చట్టాల ప్రకారం.. రైల్వే ట్రాక్ దాటడం దగ్గర నుంచి రైలును ఆపేవరకు ఆనేక నియమాలు ఉన్నాయి. వీటిల్లో ఒకటి ఉల్లంఘించినా శిక్షార్హులే. ఎలాంటి కారణం లేకుండా రైలును ఆపిన వ్యక్తికి సుమారు 12 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడవచ్చు. ఒక్కోసారి జరిమానా పడవచ్చు. లేదా శిక్ష, జరిమానా రెండూ కూడా విధించవచ్చు.

అలాగే రైల్ రోకోలు, రైలు నిలిపివేసినా, రైలు కదలికను ప్రభావితం చేసినా కూడా 14 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడవచ్చు. అదేవిధంగా, ట్రాక్ మీద దుమ్ము ధూళిని వ్యాప్తి చేయడం, రైల్వే ట్రాక్ దాటడం, చైన్ పుల్లింగ్, రైల్వే ప్రాంగణంలో గొడవలు చేయడం లాంటివి కూడా నేరంగా పరిగణిస్తారు.

మీరు రైలులో ప్రయాణిస్తున్నప్పుడు.. ఎలాంటి కారణం లేకుండా గొలుసు లాగితే.. అది నేరంగా పరిగణిస్తారు. రైల్వే చట్టంలోని సెక్షన్ 141 ప్రకారం మీరు శిక్షార్హులు. మీకు 12 నెలల వరకు జైలు శిక్ష లేదా రూ.1,000 జరిమానాను విధించవచ్చు. లేదా ఒక్కోసారి రెండూ శిక్షలు పడతాయి. అలాగే రైల్వే చట్టం సెక్షన్ -156 ప్రకారం, రైలుపైన లేదా గేటు దగ్గర నిలబడి ప్రయాణించడం చట్టరీత్యా నేరం, అలా చేస్తే రూ.500 జరిమానా లేదా మూడు నెలల జైలు శిక్ష పడవచ్చు.

Read More : 

Zodiac Signs: ఈ 3 రాశులవారు చాలా స్మార్ట్ .. ఏ పనైనా సజావుగా చేయాలనుకుంటారు.. అందులో మీరున్నారా!