జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ కస్టమర్లకు గమనిక..! మూడు నెలల ఉచిత రీఛార్జ్..? అసలు విషయం ఏంటి..

|

Apr 30, 2021 | 9:32 PM

Jio, Airtel, VI Users : మీరు సోషల్ మీడియా లేదా వాట్సాప్ ద్వారా మూడు నెలల ఉచిత రీఛార్జ్ సందేశాన్ని గమనించారా..

జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ కస్టమర్లకు గమనిక..! మూడు నెలల ఉచిత రీఛార్జ్..? అసలు విషయం ఏంటి..
Jio Airtel And Vi Users
Follow us on

Jio, Airtel, VI Users : మీరు సోషల్ మీడియా లేదా వాట్సాప్ ద్వారా మూడు నెలల ఉచిత రీఛార్జ్ సందేశాన్ని గమనించారా.. దానిని అస్సలు నమ్మవద్దు. ఒకవేళ నమ్మారంటే చాలా నష్టపోతారు. ఈ మెస్సేజ్ మీ బ్యాంక్ ఖాతాను కూడా ఖాళీ చేయవచ్చు. వాస్తవానికి సోషల్ మీడియాలో మనకు తెలియకుండా ఒక మెస్సేజ్ వైరల్ అవుతోంది. జియో, ఎయిర్టెల్ లేదా వొడాఫోన్ ఐడియా యూజర్లకు వర్క్ ఫ్రం హోం కోసం మూడు నెలల ఉచిత రీఛార్జ్ ఇస్తున్నట్లు చెబుతున్నారు. ఈ మెస్సేజ్‌లో ఈ ఆఫర్‌ను ప్రభుత్వం నిర్వహిస్తోందని పేర్కొన్నారు.

అంతేకాకుండా కరోనా పెరుగుతున్నందున ఇన్ఫెక్షన్ దృష్ట్యా.. 3 నెలల రీఛార్జిని భారతీయ వినియోగదారులందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం ప్రభుత్వం ఉచితంగా అందిస్తోందని ఉంది. మీకు జియో, ఎయిర్‌టెల్ లేదా వొడాఫోన్ సిమ్ ఉంటే ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవచ్చని.. అందుకోసం క్రింది లింక్‌పై క్లిక్ చేయండని ఉంది. దయచేసి గమనించండి ఈ ఆఫర్ 30 ఏప్రిల్ 2021 కి మాత్రమే పరిమితం చేయబడింది! త్వరపడండని సూచించారు.

ఈ మెస్సేజ్‌లో ఇచ్చిన రిఛార్జ్‌ కి సంబంధించిన లింక్ పూర్తిగా నకిలీ. దానిపై క్లిక్ చేస్తే జియో, ఎయిర్‌టెల్ వొడాఫోన్-ఐడియా రీఛార్జ్ చేయడానికి మీ ఆప్షన్‌ని ఎంచుకోమని అడుగుతూ ఒక పేజీని తెరుస్తుంది. ఆపై ఇక్కడ మీరు మీ బ్యాంక్ వివరాలను అడుగుతుంది.. ఇది కాకుండా మీ వ్యక్తిగత సమాచారం కూడా దొంగిలిస్తారు. ఈ వైరల్ మెస్సేజ్ PIB ఫాక్ట్ చెక్ చేసింది. ప్రభుత్వం అలాంటి ఆఫర్ ఇవ్వడం లేదని స్పష్టం చేసింది. అంతేకాదు మీకు ఆ మెస్సేజ్ వచ్చినట్లయితే దాన్ని ఫార్వార్డ్ చేయవద్దని కోరింది. అలాంటి లింక్‌లై క్లిక్ చేయొద్దని హెచ్చరించింది.

 

We are With India: మీ వెంటే మేమంతా.. కల్లోల సమయంలో భారత ప్రజలకు ఆఫ్ఘాన్ ప్రజల సంఘీభావం!

Viral Tweet: ఈ ర‌క‌మైన సోష‌ల్ డిస్టెన్సింగ్ చాలా ప్ర‌మాదాక‌రం.. న‌వ్వులు పూయిస్తోన్న ఆనంద్ మ‌హీంద్ర ట్వీట్‌..