Hyderabad Girl In Forbes :హైదరాబాద్‌కు చెందిన మరో అమ్మాయి అంతర్జాతీయ గుర్తింపు సాధించింది. ప్రఖ్యాత ఫోర్బ్స్ పత్రిక తాజాగా ప్రకటించిన ‘30 అండర్ 30’లో ఈసారి మహిళల హవా కనిపించింది. అందులోనూ హైదరాబాద్‌కు చెందిన తెలుగు అమ్మాయి కీర్తి రెడ్డి కొత్త(24)కు సైతం చోటు దక్కింది. 30 ఏళ్లలోపు వేర్వేరు రంగాల్లో విశిష్ట సేవలందిస్తూ.. రాణించిన 30 మంది జాబితాను ఏటా ఫోర్బ్స్ ప్రకటిస్తోంది. ఇందులో భాగంగా ‘స్టాట్విగ్’ అనే బ్లాక్‌చైన్ సాంకేతికత ఆధారిత వ్యాక్సిన్ సరఫరా నిర్వహణ ప్లాట్‌ఫాంకు సహ వ్యవస్థాపకురాలు, సీఓఓగా కీర్తి రెడ్డి వ్యవహరిస్తున్నారు. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు విశేష కృషీ చేసినందుకు కీర్తిరెడ్డి తొలి మంది జాబితాలో స్థానం సంపాదించుకున్నారు.
హైదరాబాద్‌కు చెందిన కీర్తి రెడ్డి కొత్త… ద లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ అండ్ పొలిటికల్‌సైన్స్ నుంచి మేనేజ్‌మెంట్‌లో గ్లోబల్ మాస్టర్స్ పట్టాను సాధించారు. కరోనా వ్యాక్సిన్ అలాగే, ఆహారం ద్వారా వచ్చే వృధాను అరికట్టేందుకు అవసరమైన సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా కీర్తిరెడ్డి పనిచేస్తున్నారు. అనతికాలంలోనే గొప్ప ఖ్యాతి గడిచిన కీర్తిరెడ్డి ప్రపంచస్థాయి గుర్తింపు పొందారు. కాగా ఈ జాబితాలో ప్రముఖ సినీ నటి కీర్తి సురేశ్ కూడా స్థానం సంపాదించుకున్నారు.
ఇదిలావుంటే. ఇదే జాబితాలో మరో 12 మంది మహిళలు కూడా చోటు దక్కించుకున్నారు. వారిలో అమూల్‌కూల్ బ్రాండ్ మేనేజర్ షెఫాలీ విజయ్‌వర్గీయ, ఏపీఏసీ లీడ్ నిహారిక కపూర్, యూ ట్యూబ్ కమ్యూనిటీ, అండ్ సోషియల్ మీడియా సపోర్ట్ ఆపరేషన్స్ నిషిత బలియార్‌సింగ్, నెక్సస్ పవర్ సహ వ్యవస్థాపకులు నికిత బలియార్‌సింగ్, సుప్రీం కోర్టు న్యాయవాది పౌలోమీ పావని శుక్లా, ప్రముఖ సినీ నటి కీర్తి సురేశ్, మరో నటి తృప్తి దిమ్రి, గాయకురాలు మాళవిక మనోజ్ తదితరులున్నారు.
ఈ జాబితాలో పీయూశ్ వర్మ(మనూష్ లాబ్స్ సీఈఓ), ముదిత్ దండావతె, గౌరవ్‌పర్చానీ(డోజీ సహ వ్యవస్థాపకులు), అర్కో భట్టాచార్జీ(ఓయో హోటల్స్ డైరెక్టర్), ఆకాశ్ సిన్హా(క్యాష్‌ఫ్రీ సీఈఓ), నితిన్ జయకృష్ణన్(పాండోకార్ప్ సీఈఓ), ముకుల్ రుస్తోగి, భస్వత్ అగర్వాల్(క్లాస్‌ప్లస్ సహవ్యవస్థాపకులు), హర్షిత్ గుప్తా(గ్రామోఫోన్ సహ వ్యవస్థాపకుడు) తదితరులు కూడా చోటు దక్కించుకున్నారు.
Read Also…. ఈనెల 11న జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం.. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు పరిశీలకుడి నియామకం