Lion: సింహం మీ ముందుకు వస్తే ఏమి చేయాలి.? ఈ ఒక్కటి చేస్తే..

అడవిలో పొరపాటున సింహం మీ ముందుకు వస్తే ఏమి చేయాలి.? సింహం దాడి నుంచి తృటిలో ఎలా తప్పించుకోవాలి.? మీ ప్రాణాలను కాపాడుకోవడానికి పాటించాల్సిన కీలకమైన చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ స్టోరీపై ఓ సారి లుక్కేయండి మరి. ఆ వివరలు ఇలా..

Lion: సింహం మీ ముందుకు వస్తే ఏమి చేయాలి.? ఈ ఒక్కటి చేస్తే..
Lion

Updated on: Mar 27, 2026 | 1:45 PM

అడవికి రారాజు సింహం. సింహం ఎదురైతే ఎంతటి వారైనా వణికిపోవాల్సిందే. అయితే, అడవిలో తిరుగుతున్నప్పుడో లేదా పొరపాటున సింహంతో ఎదురుగా తలపడాల్సి వచ్చినప్పుడు కంగారు పడకుండా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ప్రాణాలతో బయటపడే అవకాశం ఉంటుంది. ఆ కీలక చిట్కాలు ఇలా:

1. పరుగెత్తకండి:

సింహాన్ని చూడగానే భయంతో పరుగులు పెట్టడంఅతిపెద్ద తప్పు. మీరు పరుగెడితే సింహం మిమ్మల్ని తన ఆహారంగా భావించి వేటాడటం మొదలుపెడుతుంది. సింహం కంటే వేగంగా పరుగెత్తడం మనిషికి అసాధ్యం, కాబట్టి ఉన్న చోటే స్థిరంగా ఉండండి.

2. కళ్లలోకి చూడండి:

సింహం కళ్లలోకి నేరుగా చూడటం వల్ల దానికి ఒక రకమైన భయం కలుగుతుంది. మీరు భయపడుతున్నట్లు కాకుండా, దానికి దీటుగా ఎదురు నిలిచినట్లు అనిపించాలి. అయితే, సింహానికి మీ వీపు చూపించి వెనక్కి తిరగకండి.

3. మిమ్మల్ని మీరు పెద్దగా చూపించుకోండి:

మీరు సింహం కంటే బలమైన వారని దానికి అనిపించాలి. ఇందుకోసం మీ చేతులను పైకి ఎత్తండి లేదా మీ దగ్గర ఉన్న కోటును వెడల్పుగా విప్పండి. ఇలా చేయడం వల్ల మీరు ఆకృతిలో పెద్దగా కనిపిస్తారు, ఇది సింహాన్ని దాడి చేయకుండా ఆపే అవకాశం ఉంది.

4. శబ్దం చేయండి:

సింహాన్ని భయపెట్టడానికి గట్టిగా అరవండి లేదా చప్పట్లు కొట్టండి. మీ గొంతులో ధైర్యం కనిపించాలి. వింత శబ్దాలు చేయడం వల్ల కూడా సింహం గందరగోళానికి గురై అక్కడి నుంచి వెళ్ళిపోయే అవకాశం ఉంది.

5. వెనక్కి తగ్గండి:

కళ్లలోకి చూస్తూనే, చాలా నిదానంగా అడుగులు వెనక్కి వేయండి. సింహానికి మీపై దాడి చేసే అవకాశం ఇవ్వకుండా, నెమ్మదిగా సురక్షిత ప్రాంతానికి చేరుకోవడానికి ప్రయత్నించండి. సింహాలు సాధారణంగా మనుషులపై నేరుగా దాడి చేయడానికి ఇష్టపడవు, కేవలం తమ భూభాగాన్ని కాపాడుకోవడానికి లేదా భయం వల్ల మాత్రమే దాడి చేస్తాయి. కాబట్టి పైన పేర్కొన్న జాగ్రత్తలతో మనం ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు.

Follow Us