Road Safety: తప్పు ఎవరిదైనా డబ్బు మీకే.. జీబ్రా క్రాసింగ్ వద్ద ప్రమాదం జరిగితే చట్టం ఇచ్చిన పవర్స్ ఇవే..

1988 మోటారు వాహనాల చట్టం ప్రకారం.. జీబ్రా క్రాసింగ్ వద్ద పాదచారుల కోసం వాహనం తప్పక ఆగాలి. ఈ నిబంధన ఉల్లంఘన వల్ల ప్రమాదం జరిగితే.. బాధితులకు పరిహారం అందుతుంది. అన్ని రిజిస్టర్డ్ వాహనాలకు తప్పనిసరి అయిన థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ద్వారా వైద్య ఖర్చులు, ఇతర నష్టాలు భర్తీ అవుతాయి. ముఖ్యంగా తప్పు ఎవరిదైనా కొంత పరిహారం మాత్రం తప్పకుండా అందుతుంది.

Road Safety: తప్పు ఎవరిదైనా డబ్బు మీకే.. జీబ్రా క్రాసింగ్ వద్ద ప్రమాదం జరిగితే చట్టం ఇచ్చిన పవర్స్ ఇవే..
Pedestrian Safety And Compensation

Updated on: Nov 01, 2025 | 7:01 PM

దేశంలో పెరుగుతున్న ట్రాఫిక్, వాహనదారుల నిర్లక్ష్యం కారణంగా పాదచారుల భద్రత ఒక పెద్ద సవాలుగా మారింది. అనేక సందర్భాల్లో వాహనాలు సిగ్నల్‌లను విస్మరించినప్పటికీ, పాదచారులు తమ భద్రత కోసం జీబ్రా క్రాసింగ్‌లను ఉపయోగించడం తప్పనిసరి. ఎందుకంటే దేశ మోటారు వాహనాల చట్టంలో పాదచారుల భద్రతకు ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. ఈ విషయాలు చాలా మందికి తెలియదు. వాటిబ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

చట్టం ఏం చెబుతోంది..?

పాదాచారులు జీబ్రా క్రాసింగ్ వద్ద రోడ్డు దాటుతున్నప్పుడు.. వాహనం తప్పకుండా ఆగాలని 1988 మోటారు వాహనాల చట్టం చెబుతోంది. డ్రైవర్ ఈ నియమాన్ని ఉల్లంఘించి, ప్రమాదం జరిగితే, మీకు పరిహారం అడిగే పూర్తి హక్కు ఉంది.

చట్టపరమైన రక్షణ – పరిహార ప్రక్రియ

ప్రమాదం జరిగినప్పుడు పాదచారులకు చట్టపరమైన రక్షణ లభించే ప్రక్రియ:

ఎఫ్ఐఆర్: ప్రమాదం జరిగిన వెంటనే పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలి.
సాక్ష్యాల సేకరణ: ఆ తర్వాత వైద్య నివేదికలు, సాక్షుల వాంగ్మూలాలు, ప్రమాద వివరాలను సేకరించాలి.
దావా : సేకరించిన ఈ పత్రాలన్నింటినీ మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ కు సమర్పించాలి.

పరిహారం వివరాలు

దేశంలో అన్ని రిజిస్టర్డ్ వాహనాలకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరి. ఈ ఇన్సూరెన్స్ గాయపడిన పాదచారులకు పరిహారాన్ని అందిస్తుంది. మీ వైద్య ఖర్చులన్నీ కంపెనీయే భరిస్తుంది. అదనంగా ప్రమాదం కారణంగా వ్యక్తికి జరిగిన నష్టానికి కూడా భర్తీ లభిస్తుంది.

తప్పు ఎవరిదైనా డబ్బు వస్తుంది

మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్లు 140, 163A ప్రమాదానికి ఎవరు కారణమని తేలకపోయినా.. చట్టం ప్రకారం మీకు తప్పకుండా కొంత పరిహారం అందుతుంది.

తక్షణ నగదు రహిత చికిత్స

రూ. 1.5 లక్షల వరకు: ఏదైనా వాహన ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి చికిత్స కోసం గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు డబ్బు అందుతుంది. ఇది ప్రమాదం జరిగిన 7 రోజుల్లోపే వస్తుంది. దీనివల్ల బాధితులకు త్వరగా సరైన చికిత్స అందుతుంది.

ఢీకొట్టి పారిపోతే’ ఏం చేయాలి..?

ప్రమాదం చేసిన వాహనం తెలియకపోయినా పరిహారం వస్తుంది. ప్రమాదంలో మరణం సంభవిస్ కేంద్ర ప్రభుత్వ పథకం కింద రూ. 2 లక్షల వరకు, శాశ్వత వైకల్యం సంభవిస్తే రూ. 50,000 వరకు పరిహారం లభిస్తుంది.

ఒకవేళ మీరు నిర్లక్ష్యంగా రోడ్డు దాటారని విచారణలో తేలితే, పరిహారం కొద్దిగా తగ్గవచ్చు, కానీ మొత్తం ఆగిపోదు. ఒకవేళ డ్రైవర్ మద్యం సేవించి లేదా నిర్లక్ష్యంగా వాహనం నడిపినట్లు తేలితే.. ఆ డ్రైవర్‌పై క్రిమినల్ కేసు నమోదు అవుతుంది. పాదచారుల భద్రతను కాపాడటానికి ప్రభుత్వం కృషి చేస్తోంది.