Washing Clothes Tips: బట్టలు ఉతకడం, ఆరబెట్టడంలో ఇలాంటి తప్పులు చేస్తున్నారా.. అయితే ఈ చిట్కాలు మీ కోసమే..

|

Jul 13, 2022 | 7:51 PM

వర్షాలు పడుతున్నాయంటే అంటువ్యాదులు చుట్టుముడుతుంటాయి. అయితే ఇలాంటి సమయంలో మనం వేసుకునేవాటి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. 

Washing Clothes Tips: బట్టలు ఉతకడం, ఆరబెట్టడంలో ఇలాంటి తప్పులు చేస్తున్నారా.. అయితే ఈ చిట్కాలు మీ కోసమే..
Dry Clothes At Home
Follow us on

బట్టలు ఉతకడం, ఆరబెట్టడం పెద్ద సమస్యగా మారుతుంది. అంతే కాదు వర్షాలు పడుతున్నాయంటే అంటు రోగాలు చుట్టుముడుతుంటాయి. అయితే ఇలాంటి సమయంలో మనం వేసుకునేవాటి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.  జోరు వానలు పడుతున్న సమయంలో ఉతికన బట్టలను ఆరబెట్టడం ఓ సవాలుగా మారుతుంది. ఆ తడి పట్టలను బాల్కనీలో లేదా సూర్యకాంతి, స్వచ్ఛమైన గాలి లేని ప్రదేశంలో బట్టలు ఆరబెట్టినట్లయితే.. చర్మం, శ్వాసకోశ సమస్యలను కలిగిస్తుంది. అటువంటి అంటు వ్యాదులు వర్షంకాలంలో మరింత పెరుగుతాయి. వర్షంలో, వీధి లేదా తడి బట్టలు నుంచి ఫంగల్ ఇన్ఫెక్షన్ ప్రమాదం ఉంది. మీ ఈ చిన్న అలవాట్లు మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేస్తాయి. బట్టలు ఉతకడంతోపాటు.. ఆరబెట్టడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి.

1- అందరివి ఒకేసారి కాకుండా..

ఈ మధ్య ప్రతి ఇంట్లో వాషింగ్ మెషీన్లు ఉన్నాయి. అయితే అందరి బట్టలను ఓకేసారి కాకుండా విడి విడిగా ఉతకండి. దీని వల్ల ఒకరి బట్టల నుంచి మరొకరికి ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంది. ఇలా బట్టలు ఉతకడం వల్ల క్రిములు వ్యాపించే ప్రమాదం ఉంది. 

2- ఎక్కువ డిటర్జెంట్ వాడకం

మీరు ఎక్కువ డిటర్జెంట్ ఉపయోగిస్తే అది శరీరంపై అలెర్జీ, చికాకు గురి చేసే అవకాశం ఉంది. అదే సమయంలో బట్టల రంగు కూడా త్వరగా పోయే అవకాశం ఉంది.

3- ఇంటిలోపల బట్టలు ఆరబెట్టవద్దు-

కొంతమంది ఇంటిలోపల బట్టలు ఆరబెడతారు. ఇది బట్టలలో తేమ ఉంటుంది. ఇలా ఇంట్లోకి తేమ వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఇది కంటిలో ప్రమాదకరమైన ఫంగల్ ఇన్ఫెక్షన్‌కు దారి తీస్తుంది. 

బట్టలు సరిగా ఉతకకపోవడం.. ఆరబెట్టకపోవడం వల్ల బట్టల్లో తేమ అలాగే ఉంటుంది. ఇది బ్యాక్టీరియాను మోసుకొస్తుంది. ఇది చర్మంపై స్కిన్ డెర్మటైటిస్ అనే అలెర్జీని కలిగిస్తుంది.

5- వర్షంలో బట్టల నుంచి ఫంగల్ ఇన్ఫెక్షన్- 

మీకు ఫంగల్ ఇన్ఫెక్షన్ లేదా చర్మంపై మొటిమలు ఉంటే.. దీనికి కారణం మీ బట్టల్లో ఉండే తేమ కూడా కావచ్చు. బట్టలు సరిగ్గా ఆరబెట్టకపోవడం వల్ల కూడా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తుంది.

హెల్త్ న్యూస్ కోసం..