Masked Aadhaar: ఇప్పుడు మన దేశంలో ఏ పనికైనా ఆధార్ కార్డ్ తప్పనిసరి అవసరంగా మారిపోయింది. దాదాపుగా ప్రతి ప్రభుత్వ పథకంలోనూ ఆధార్ కార్డ్ కచ్చితంగా అడుగుతున్నారు. ఇక ఆధార్ కార్డ్ లో ఏదైనా తప్పులు దొర్లితే ఇంతకుముందు ఆధార్ సెంటర్ కు వెళ్లి సరిచేసుకోవాల్సి వచ్చేది. చిరునామా, పుట్టిన తేదీ, లింగం ఇటువంటివి మార్చుకోవాల్సి వస్తే ఇబ్బందులు ఎదుర్కొనే వారు. కానీ, ఇప్పుడు యుఐడిఎఐ (UIDAI) వీటన్నిటినీ సులభతరం చేసింది. ఆన్‌లైన్‌లోనే అన్నీ మార్చుకునే విధంగా ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో తాజాగా మరో ఫీచర్ ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చింది యుఐడిఎఐ (UIDAI). దీనిని మాస్క్ ఆధార్ అని చెబుతున్నారు. అంటే, మన ఆధార్ నెంబర్ కార్డ్ పై పూర్తిగా కనిపించదు. చివరి నాలుగు అంకెలు మాత్రమె కనిపిస్తాయి. మన ఆధార్ లో కనిపించే 12 అంకెల నంబర్ లో మొదటి ఎనిమిది అంకెలూ “xxxx-xxxx” గా కనిపిస్తాయి. తరువాత నాలుగు అంకెలు మాత్రమె అంకెల రూపంలో కనిపిస్తాయి. ఇది కార్డును మరింత సురక్షితంగా మారుస్తుంది.
ఇప్పుడు ఈ సురక్షితమైన ఆధార్ కార్డును మీరు ఆన్‌లైన్ నుంచి నేరుగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన లింక్ కూడా ఇచ్చింది యుఐడిఎఐ (UIDAI). మీరు ఈ ముసుగు కార్డ్ లేదా మాస్క్ కార్డ్ తీసుకుంటే మీ నెంబర్ మాత్రమె మాస్క్ చేసి కనిపిస్తుంది. మిగిలిన వివరాలు అంటే..పేరు, పుట్టిన తేదీ, లింగం, చిరునామా, క్యూఆర్ కోడ్ వంటివి మామూలుగానే కనిపిస్తాయి. మరి ఈ మాస్క్ ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేయడం ఎలా? మాస్క్ ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేయడానికి, యుఐడిఎఐ ప్రత్యక్ష లింక్‌ను వెల్లడించింది. ఇదీ ఆ లింక్ https: //eaadhaar.uidai.gov.in. ఇప్పుడు ఈ లింక్ ఉపయోగించి మీ మాస్క్ ఆధార్ కార్డ్ ఎలా డౌన్ లోడ్ చేసుకోవచ్చో చూద్దాం..
మాస్క్ ఆధార్ వివరాలు చెబుతూ యూఐడీఏఐ చేసిన ట్వీట్ ఇదే..
#AadhaarTutorials
You can download your Masked Aadhaar or Regular Aadhaar online from:https://t.co/C190bWfd0U
You can use either: Aadhaar number, Your EID (enrolment ID), or Your Virtual ID (VID) to download your Aadhaar pdf.
To know more click:https://t.co/blaLymhhAk— Aadhaar (@UIDAI) June 23, 2021
ఏలియన్స్ ఉంటే కచ్చితంగా మనల్ని చూస్తూనే ఉంటారు!లీసా కాల్టేనెగర్ వివరణ :Aliens