ఇంట్లోనే బంగారం, వెండి ఆభరణాలకు పాలిష్ చేసుకునేదెలా..? ఈ సింపుల్ టిప్స్‌తో దగదగలే..

ప్రస్తుతం మనం పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌లో ఉన్నాం.. ఇక ఇప్పుడు ప్రజలు తమ బంగారు, వెండి ఆభరణాలను ధరించడానికి ఇష్టపడే సమయం ఇది. అయితే, చాలా సార్లు పాత ఆభరణాలపై మురికి పేరుకుపోతుంది. దాని మెరుపు కూడా మసకబారుతుంది. అటువంటి పరిస్థితిలో కొందరు తమ ఆభరణాలను శుభ్రం చేసుకోవడానికి స్వర్ణకారుల వద్దకు వెళతారు. మరికొందరు ఇంట్లోనే నానా తంటాలు పడుతుంటారు. కానీ ఈ రోజు మనం బంగారం, వెండి ఆభరణాలను శుభ్రం చేయడానికి ఒక సులభమైన ఉపాయాన్ని ఇక్కడ తెలుసుకుందాం...

ఇంట్లోనే బంగారం, వెండి ఆభరణాలకు పాలిష్ చేసుకునేదెలా..? ఈ సింపుల్ టిప్స్‌తో దగదగలే..
Clean Gold And Silver

Updated on: Aug 16, 2025 | 5:52 PM

బంగారం అంటే ఇష్టపడని ఆడవాళ్లు దాదాపుగా ఎవరూ ఉండరనే చెప్పాలి. ముఖ్యంగా మన దేశంలో మహిళలందరికీ బంగారం అంటే మక్కువ ఎక్కువగా ఉంటుంది. పండుగలు, పెళ్లిళ్లు, ప్రత్యేక సందర్భాల్లో తప్పనిసరిగా బంగారం కొంటూ ఉంటారు. అయితే.. కొద్ది రోజులు వేసుకున్న తర్వాత.. బంగారు, వెండి నగలు మెరుగు తగ్గుతూ ఉంటాయి. ఒక్కసారి పాలిష్ పెట్టిస్తే… మళ్లీ కొత్తవాటిలా మెరిసిపోతాయి. ఇందుకోసం కొందరు స్వర్ణకారుల వద్దకు వెళ్తుంటారు. మరికొందరు ఇంట్లోనే తెలిసిన చిట్కాలు పాటిస్తూ ఉంటారు..అలాంటి ఒక అద్భుత చిట్కా ఇక్కడ చూద్దాం..

ఈ పండుగల సమయంలో ఇంట్లోని వస్తువులను ఉపయోగించి నిమిషాల్లో మీ ఆభరణాలను శుభ్రం చేసుకోవచ్చు. ఇందుకోసం ఒక పాన్ లో కొంచెం నీరు తీసుకుని గ్యాస్ మీద పెట్టి వేడి చేయండి. నీళ్లు మరిగేటప్పుడు, అందులో 2 టీస్పూన్ల టీ ఆకులు వేయండి. టీ ఆకులను సరిగ్గా మరిగించిన తర్వాత గ్యాస్ ఆపివేసి రెండు వేర్వేరు గిన్నెలలో సగానికి ఫిల్టర్ చేయండి. ఇప్పుడు రెండు గిన్నెలలో ఒక్కొక్క చెంచా బేకింగ్ సోడా, సర్ఫ్ పౌడర్ వేసుకోవాలి.

ఇప్పుడు వెండి ఆభరణాలను ఒక గిన్నెలో ముంచి, బంగారు ఆభరణాలను మరొక గిన్నెలో ముంచి, బంగారు ఆభరణాలను ముంచిన గిన్నెలో ఒక టీస్పూన్ పసుపు పొడిని కూడా వేయాలి. ఇక వాటిని 10-12 నిమిషాలు అలాగే నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆపై వాటిని బయటకు తీసి టూత్ బ్రష్ సహాయంతో సున్నితంగా శుభ్రం చేయండి. ఇలా చేయడం వల్ల వాటి మురికి తొలగిపోతుంది.ఇప్పుడు దానిని శుభ్రమైన నీటితో వాష్‌ చేసుకోవాలి. ఈ ట్రిక్ ట్రై చేయడం ద్వారా, మీరు మీ పాత ఆభరణాలను కొత్తగా మెరిసేలా చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..