e-PAN Card: మీరు ఇంట్లో కూర్చొని e-PAN పొందవచ్చు.. ఇలా దరఖాస్తు చేసుకోండి.. నిమిషాల్లో పని అయిపోతుంది!

|

Dec 11, 2021 | 8:08 PM

ఆదాయపు పన్ను శాఖ పన్ను చెల్లింపుదారులకు ఈ-పాన్ జారీ చేసే సేవను అందిస్తుంది. ఈ సేవ ద్వారా శాశ్వత ఖాతా సంఖ్య (PAN) ఇంట్లో కూర్చోని పొందవచ్చు.

e-PAN Card: మీరు ఇంట్లో కూర్చొని e-PAN పొందవచ్చు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..  నిమిషాల్లో పని అయిపోతుంది!
Aadhaar Pancard Link
Follow us on

Income tax dept. e-PAN Card: ఆదాయపు పన్ను శాఖ పన్ను చెల్లింపుదారులకు ఈ-పాన్ జారీ చేసే సేవను అందిస్తుంది. ఈ సేవ ద్వారా శాశ్వత ఖాతా సంఖ్య (PAN) ఇంట్లో కూర్చోని పొందవచ్చు. అయితే, ఒక షరతు మాత్రం విధించింది. పాన్ కార్డు పొందాలంటే, వ్యక్తి తన ఆధార్ నంబర్‌ను కలిగి ఉండాలని, దానిని మొబైల్ నంబర్‌తో లింక్ చేసి ఉండాలని ఆదాయ పన్ను శాఖ సూచించింది.

e-PAN కోసం దరఖాస్తు చేసుకునే ముందు, కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం ముఖ్యం. ముందుగా చెప్పినట్లుగా, చెల్లుబాటు అయ్యే ఆధార్, దానికి లింక్ చేయబడిన మొబైల్ నంబర్ అవసరం. ఇది కాకుండా, దరఖాస్తుదారు మేజర్ అయ్యిండాలి. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 160(ఏ) తరపున ప్రతినిధిగా ఉండకూడదు.

పాన్ కార్డు పొందాలంటే, ఈ సులభమైన దశలను అనుసరించండిః

దశ 1: ముందుగా, ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ పోర్టల్‌ని సందర్శించాలి. దీని కోసం, పన్ను చెల్లింపుదారులు ఈ లింక్‌పై క్లిక్ చేయాలి: https://eportal.incometax.gov.
దశ 2: ఆ తర్వాత, వ్యక్తి త్వరిత సేవల ట్యాబ్‌లోని తక్షణ e-PAN ఎంపికపై క్లిక్ చేయాలి.
దశ 3: ఆ తర్వాత, e-PAN పేజీలో, గెట్ e-PAN ఎంపికపై క్లిక్ చేయండి.
దశ 4: ఇప్పుడు మీరు 12 నంబర్ ఆధార్ నంబర్‌ను నమోదు చేయాలి.
దశ 5: ఆధార్ నంబర్‌ను సమర్పించిన తర్వాత, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ప్రమాణీకరణ కోడ్ (OTP) పంపబడుతుంది.
స్టెప్ 6: దాన్ని నమోదు చేసిన తర్వాత, వ్యక్తి ఫోటో, ఇంటి చిరునామా, పుట్టిన తేదీ, లింగం వంటి వివరాలు మీ స్క్రీన్‌పై కనిపిస్తాయి. మీరు వీటిని ధృవీకరించాల్సి ఉంటుంది. ఈ వివరాలు పూర్తిగా సరైనవా కాదా అని తనిఖీ చేసి, ఆపై నిర్ధారించండి.
దశ 7: మీరు వ్యక్తిగత వివరాలను ధృవీకరించిన తర్వాత , దరఖాస్తు విజయవంతంగా సమర్పించాలి. భవిష్యత్తు సూచన కోసం రసీదు సంఖ్య (Acknoledgement) వస్తుంది. భవిష్యత్ సూచన కోసం ఈ నంబర్‌ను జాగ్రత్తగా ఉంచండి. ఇప్పుడు ఈ ప్రక్రియ పూర్తయింది.

రుసుము
ఆదాయపు పన్ను శాఖ ఈ సేవ పూర్తిగా ఉచితం. ఈ-పాన్‌ను కేటాయించినందుకు పన్ను చెల్లింపుదారు నుండి ఎలాంటి పన్ను విధించదు.

ఈ విషయాలను గుర్తుంచుకోండి
e-PAN భౌతిక PAN కార్డ్ వలె అదే విలువను కలిగి ఉంటుంది. ఇది ప్రామాణిక PAN దరఖాస్తు విధానాన్ని ఉపయోగించి జారీ చేయడం జరుగుతుంది. ఈ-పాన్‌ను కేటాయించిన తర్వాత, ఈ-కెవైసి వివరాల ఆధారంగా ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ ఖాతాను సృష్టించవచ్చు.

Read Also… Flaxseed Ladoo: పాతతరం సాంప్రదాయ స్వీట్ నువ్వుల లడ్డు.. రోజు ఒకటి తిన్నా అద్భుతప్రయోజనాలు.. రెసిపీ మీకోసం