Social Media Helped : ఫేస్‌బుక్ చేసిన పెళ్లి.. రిక్వెస్ట్ యాక్సెప్ట్.. అంతా సోషల్ మీడియా మహిమ.. ఎలాగో తెలుసుకోండి..

|

Mar 24, 2021 | 7:29 AM

Social Media Helped : ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ఎంతగా విస్తరించిందో చెప్పనక్కరలేదు. పదేళ్ల బాలుడి నుంచి పండు ముదుసలి వరకు

Social Media Helped : ఫేస్‌బుక్ చేసిన పెళ్లి.. రిక్వెస్ట్ యాక్సెప్ట్.. అంతా సోషల్ మీడియా మహిమ.. ఎలాగో తెలుసుకోండి..
Social Media Helped
Follow us on

Social Media Helped : ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ఎంతగా విస్తరించిందో చెప్పనక్కరలేదు. పదేళ్ల బాలుడి నుంచి పండు ముదుసలి వరకు ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్ అంటు ఆన్‌లైన్‌లో చెలరేగిపోతున్నారు. దీంతో ఎక్కడో మారు మూలన జరిగిన పనికూడా సులువుగా అందరికి తెలిసిపోతుంది. దటీజ్ సోషల్ మీడియా అంటోంది. తాజాగా జీవితంలో పెళ్లి కాదని బాధపడుతున్న ఇద్దరు దివ్యాంగుల పెళ్లి చేసి శభాష్ అనిపించుకుంటోంది. ఆ వివరాలు ఏంటో చూద్దాం..

ఒడిషాలోని సంబ్లాపూర్‌కు చెందిన 43 ఏళ్ల లక్ష్మిరాణి త్రిపాఠి, జార్ఖండ్‌కు చెందిన 48 ఏళ్ల మహబీర్ ప్రసాద్ శుక్లా ఇద్దరూ పుట్టుకతోనే చెవిటి, మూగ. వీరికి జోడీ దొరక్కపోవడంతో ఇన్నేళ్లుగా వారి పెళ్లి కాలేదు. కుటుంబ సభ్యులు సంబంధాలు చూసినప్పటికీ వైకల్యం వల్ల అవతలి వారు తిరస్కరించడంతో ఇద్దరూ బ్యాచిలర్స్‌గానే మిగిలిపోయారు. దీంతో జీవితాంతం ఇలాగే ఉండాలని బాధపడుతున్న రోజుల్లో సోషల్ మీడియా వారి జీవితాలను మార్చేసింది. ఎలాగంటే.. అందరు ఫేస్‌బుక్ అకౌంట్స్‌ క్రియేట్ చేసుకుంటుంటే వారు కూడా చేసుకున్నారు. ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ సజెస్ట్ చేస్తున్న క్రమంలో.. వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేయడంతో వీరి లవ్ స్టోరి షురూ అయింది.

ఇద్దరికీ వినపడదు, పైగా మాట్లాడలేరు. అయినా తమ ప్రేమను సైన్ లాంగ్వేజ్‌లో ఎక్స్‌ప్రెస్ చేసుకున్నారు. ఫేస్‌బుక్ మెసెంజర్ మెసేజెస్‌, వాట్సాప్ వీడియో కాల్స్‌లో ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. ఇద్దరి వైకల్యాలు సేమ్ కనుక వారి మధ్య ప్రేమ మరింత బలపడింది. దీంతో ఇరువురి కుటుంబీకులు వీరి ప్రేమను అంగీకరించడంతో వారి పెళ్లి జరిగింది. సోషల్ మీడియా వల్లే తమ పిల్లల పెళ్లి జరిగిందని ఇరు కుటుంబాల సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ఒక్క చెడు మాత్రమే అప్పుడప్పుడు ఇలాంటి మంచి మంచి సంఘటనలు కూడా జరుగుతుండటం శుభపరిణామంగా చెప్పుకోవచ్చు.

Urvashi Rautela: భారీ డ్రెస్ లో మెరిసిన అందాల ఊర్వశి.. ఫ్యాషన్ కోసం తప్పదంటున్న బ్యూటీ

Women Suicide: జనవరిలో వివాహం.. అప్పుడే భర్త వేధింపులు.. ఆత్మహత్యకు పాల్పడిన నవవధువు.. కారణం తెలిస్తే..