Aeroplane Price : విమానం ధర ఎంతుంటుందో ఎప్పుడైనా ఆలోచించారా.. ఆ పూర్తి వివరాలు మీ కోసమే..

|

Oct 05, 2022 | 1:42 PM

విమానానికి స్థిరమైన ధర అంటూ ఉండదు. ఎందుకంటే ఆ విమానంలో ఇన్స్టాల్ చేయబడిన పరికరాలు, దాని లక్షణాలు, దాని పరిమాణంపై ఆధారపడి ఉంటుంది.

Aeroplane Price : విమానం ధర ఎంతుంటుందో ఎప్పుడైనా ఆలోచించారా.. ఆ పూర్తి వివరాలు మీ కోసమే..
Aeroplane
Follow us on

విమానం అనేది సాధారణ వాడుకలో గాలిలో ప్రయాణించడానికి వీలుగా తయారుచేయబడిన వాహనము. వీటినే ఉత్తర అమెరికాలో ఎయిర్‌ప్లేన్‌లు అని..  ఒక కెనడా తప్ప ఐర్లాండ్లో, కామన్‌వెల్త్ దేశాల్లో ఏరోప్లేన్‌లు అని అంటారు. ఈ పదాలు గ్రీకు భాష నుంచి వచ్చాయి. గ్రీక్ భాషలో ఏరాస్ అనగా “గాలి” అని అర్థం. అయితే.. విమానాన్ని సాంకేతిక పరిభాషలో ఫిక్స్డ్-వింగ్ ఎయిర్ క్రాఫ్ట్‌ అని అంటారు. అంటే స్థిరంగా, కదలకుండా రెక్కలు ఉండే విమానం. ఇతర విమానాలతో రోటరీ వింగ్ ఏర్‌క్రాఫ్ట్ లేదా ఆర్నిథాప్టర్స్ వీటిని వేరు చేయడానికి అనువుగా ఈ పదాన్ని వాడతారు. ఫిక్స్డ్-వింగ్ ఎయిర్ క్రాఫ్ట్ గాలికంటే బరువైనదై ఉండడంతో పాటు రెక్కలు ఎగరడానికి కావాలసిన శక్తిని విమానానికి ఇవ్వలేవు.

అయితే.. విమానాన్ని చూడగానే.. దాని ధర ఎంత అనే ప్రశ్న చాలాసార్లు మనకు మనస్సులో మెదులుతుంది. చాలా మంది పై నుంచి వెళ్తున్న విమానం కొనేయాలని ప్లాన్ చేస్తుంటారు. అయితే వారి దాని ధర ఎంత ఉంటుందో కూడా తెలియదు. కానీ సంతోషంలో విమానం కొనాలి అంటారు. దీని ధర గురించి తెలియదు. ఈ స్టోరీలో దాని ధర ఎంత ఉంటుందో తెలుసుకుందాం..

విమానం ఖరీదు ఇలా ఉంటుంది..

విమానానికి స్థిరమైన ధర అంటూ ఉండదు. ఇది దానిలో ఇన్స్టాల్ చేయబడిన పరికరాలు, దాని లక్షణాలు, దాని పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. అత్యంత ఖరీదైన విమానం గురించి మాట్లాడుకుంటే.. బోయింగ్ కంపెనీకి చెందిన విమానాలు చాలా ఖరిదైనవిగా ఉంటాయి.

ప్రయాణీకుల విమానాల ధరలను పరిశీలిస్తే.. ఫైనాన్సిస్ ఆన్‌లైన్ వెబ్‌సైట్ ప్రకారం..

  • B-2 స్పిరిట్ ఎయిర్‌క్రాఫ్ట్ ధర $737 మిలియన్లు
  • గల్ఫ్‌స్ట్రీమ్ IV ఎయిర్‌క్రాఫ్ట్ ధర $38 మిలియన్లు

అయితే.. విమానాల వినియోగం, ఖర్చు కారణంగా ధరలలో చాలా వ్యత్యాసం ఉంటుంది

విమానాల తయారీకి చాలా ఖర్చు అవుతుంది..

విమానాన్ని తయారు చేయడానికి చాలా శ్రమ, అత్యాధునిక యంత్రాలు అవసరం. దానివల్ల వాటి ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి. అత్యంత అధునాతన విమానాలు అమెరికాకు చెందినవిగా చెప్పవచ్చు. బోయింగ్ విమానాలలో అత్యుత్తమ సౌకర్యాలు ఉండటమే కాకుండా వాటి ధరలు కూడా చాలా ఎక్కువగా ఉండడానికి కారణం ఇదే. వేర్వేరు విమానాలు వేర్వేరు ధరలను కలిగి ఉంటాయి. కొన్ని విమానాల ధరలు ఎక్కువగా ఉండవు. చాలా మంది వ్యక్తులు తమ వ్యక్తిగత అవసరాల కోసం ప్రైవేట్ విమానాలను కూడా కొనుగోలు చేస్తారు.

ఇండియన్ ఎయిర్‌లైన్స్ గురించి

భారతీయ విమానాల కంపెనీల విషయానికొస్తే.. ఎయిర్ ఇండియా, ఇటీవల రాకేష్ జున్‌జున్‌వాలా ప్రారంభించిన ప్యాసింజర్ ఎయిర్‌లైన్ కంపెనీ ఆకాషా వంటి కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీల్లో వాడే విమానాల ఖరీదు కూడా చాలా బాగుంటుంది.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం