Holi 2023: రసాయన రంగులకు బై-బై చెప్పండి.. ఇంట్లోనే ఇలా సహజ హోలీ రంగులను రెడీ చేసుకోండి..

రంగుల కేళీ..హోలీ.. దేశం మొత్తం రంగులో మునిగి తేలుతుంది. చిన్నా, పెద్దా తేడా లేకుండా ఒకరిపై మరొకరు రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా హోలీ వేడుకలను జరుపుకుంటున్నారు. అయితే ఇందు కోసం వినియోగించే రంగులను మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు..

Holi 2023: రసాయన రంగులకు బై-బై చెప్పండి.. ఇంట్లోనే ఇలా సహజ హోలీ రంగులను రెడీ చేసుకోండి..
Homemade Holi Colours

Updated on: Mar 03, 2023 | 5:58 PM

హోలీ అనేది రంగుల పండుగ. వసంత కాలంలో వచ్చే ఈ పండుగను భారత దేశంలోనే కాకుండా, నేపాల్, బంగ్లాదేశ్‌తోపాటు ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో జరుపుకుంటారు. భారత దేశంలోని పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌లలో దీన్ని దోల్‌యాత్రా లేదా బసంత-ఉత్సబ్ అని అంటారు. ఇది సాధారణంగా శీతాకాలం చివర్లో ఫిబ్రవరి లేదా మార్చి నెలల తదుపరి వారాల్లో వచ్చే చివరి ఫాల్గుణమాసంలో (ఫిబ్రవరి/మార్చి) ఫాల్గుణ పౌర్ణమి రోజున జరుపుకుంటారు. వసంత కాలంలో వాతావరణములో మార్పూలు జరగటం వల్ల వైరల్ జ్వరం, జలుబు వస్తాయని ప్రజలు విశ్వసిస్తారు. అందుకని, సహజమైన రంగు పొడులను చల్లుకోవడం వల్ల ఔషధముగా పనిచేస్తుందని.. సంప్రదాయంగా రంగులను నిమ్మ , కుంకుమ, పసుపు, బిల్వ లను ఉపయోగించి ఆయుర్వేద వైద్యులు ఔషధ వనమూలికలను తయారు చేస్తారు.

హోలీ సందర్భంగా, మార్కెట్‌లో రంగులు మాత్రమే కనిపిస్తాయి. అటువంటి పరిస్థితిలో ఏ రంగు బాగుంటుందో అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే కొన్ని రంగుల్లో రసాయనాలు ఉంటాయి. కాబట్టి చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ రంగులు మీ జుట్టు, చర్మం రెండింటికి హాని కలిగిస్తాయి.

ఇంట్లోనే హోలీ రంగులు

మీరు మీ చర్మాన్ని రసాయనాల నుంచి రక్షించుకోవాలనుకుంటే.. బయటి నుంచి రంగును తెచ్చుకోకుండా ఇంట్లో సహజ రంగును సిద్ధం చేసుకోండి. ఇంట్లో తయారుచేసే ఈ రంగుల్లో ఎలాంటి రసాయనాలు వాడరు కాబట్టి చర్మానికి హాని కలుగుతుందన్న భయం ఉండదు.

గులాల్ ఇలా తయారు చేసుకోండి..

హోలీ సందర్భంగా మీరు ఇంట్లో పింక్ కలర్ చేయాలనుకుంటే.. దాని కోసం మార్కెట్ నుంచి క్యారెట్లు, బీట్‌రూట్‌లను తీసుకురండి. క్యారెట్, బీట్‌రూట్ రసాన్ని తీసి, కాసేపు వేడి చేయండి. ఆ రసం చిక్కగా అయ్యాక నీళ్లలో కలిపి హోలీని ఆస్వాదించండి. నీటిలో కలిపిన తర్వాత అది సహజమైన గులాబీ రంగులోకి మారుతుంది.

ఎరుపు రంగును ఇలా తయారు చేయండి

మీరు హోలీ సందర్భంగా ఎరుపు రంగును సహజ పద్ధతిలో తయారు చేయాలనుకుంటే, ముందుగా ఎరుపు గులాబీ రేకులను తెచ్చి ఎండలో ఆరబెట్టండి. అవి బాగా ఆరిపోయాక మెత్తగా పొడి చేసుకోవాలి. ఆ తర్వాత హోలీకి రెడ్ కలర్ లాగా వాడుకోవచ్చు. దీని వల్ల చర్మానికి ఎలాంటి ఇబ్బంది కలగదు. దాని నుంచి వచ్చే సువాసన కూడా చాలా బాగుంటుంది.

పసుపు రంగును తయారు చేసే విధానం

హోలీ అనేది రంగుల పండుగ. ఆ రోజు అంతా రంగులో మునిగిపోతారు. మీరు హోలీ నాడు పసుపు రంగును సహజ పద్ధతిలో తయారు చేయాలనుకుంటే.. మీరు అందులో పసుపును ఉపయోగించాలి. పసుపు రంగు గులాల్ చేయడానికి.. ఒక చెంచా పసుపులో 2 లేదా 3 చెంచాల ముల్తానీ మిట్టి పొడిని కలపండి. అంతే, మీ పసుపు రంగు గులాల్ సిద్ధంగా ఉంది.

ఆకుపచ్చని ఎలా తయారు చేయాలంటే..

ఆకుపచ్చ రంగును తయారు చేయడానికి, మీకు హెన్నా, కొత్తిమీర ఆకులు అవసరం. ఇందుకోసం ముందుగా గోరింటాకు, కొత్తిమీర తరుగును పొడి చేసి మెత్తగా రుబ్బుకోవాలి. దీని తర్వాత అందులో కొద్దిగా ముల్తానీ మిట్టి కలపాలి. గ్రీన్ కలర్ గులాల్ చిటికెలో రెడీ అవుతుంది.

మోదుగ పూలతో రంగులు..

మోదుగ పూలను తెంపి వాటిని ఒకరోజుపాటు ఎండలో ఆరబెడతాం. పువ్వులు ఆరిన తరువాత వాటిని నీటిలో వేసి రెండు గంటలపాటు మరిగిస్తాం. పువ్వులు మరిగేటప్పుడు వాటి నుంచి రంగు బయటకు వస్తుంది. పూర్తిగా మరిగాక ఆ నీటిని గంజిపొడితో కలుపుతాం. మూలిక మొక్కల నుంచి తీసిన గంజిపొడిని ఈ నీళ్లతో కలపడంతో అది మంచి రంగులోకి మారి కలర్‌ తయారవుతుంది. ఈ హెర్బల్‌ గులాల్‌ తయారు చేయడానికి మీకు పెద్దగా ఖర్చు ఉండదు. సగటున రూ.60 నుంచి 70 రూపాయలకు అవుతుంది. ఈ రంగులకు విదేశాల్లో భలే డిమాండ్ ఉంది.

గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సామాజిక దృక్కోణంపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. వాటిని స్వీకరించే ముందు నిపుణుల సలహా తీసుకుంటే మంచిది.

Note: ( ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఉంది. టీవీ9 NEWS దానిని ధృవీకరించలేదు.)

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం