Himalayas from Space: అంతరిక్షం నుంచి మన హిమాలయాల అందాలను చూస్తే వావ్ అనకుండా ఉండలేరు!

|

Jun 03, 2021 | 8:20 PM

Himalayas from Space: విశాలమైన విశ్వం గురించి మనకు తెలిసింది గోరంత కూడా ఉండదు. మనిషికి ఉండే శోధనా ఆసక్తితో విశ్వ రహస్యాల కోసం నిరంతరం పరిశోధిస్తూనే ఉన్నాడు మానవుడు.

Himalayas from Space: అంతరిక్షం నుంచి మన హిమాలయాల అందాలను చూస్తే వావ్ అనకుండా ఉండలేరు!
Himalayas From Space
Follow us on

Himalayas from Space: విశాలమైన విశ్వం గురించి మనకు తెలిసింది గోరంత కూడా ఉండదు. మనిషికి ఉండే శోధనా ఆసక్తితో విశ్వ రహస్యాల కోసం నిరంతరం పరిశోధిస్తూనే ఉన్నాడు మానవుడు. ఇందులో భాగంగానే రోదసిలో తనకోసం ప్రత్యెక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అదే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ( ఐఎస్ఎస్). ఇక్కడ అంతరిక్షానికి సంబంధించిన అనేక పరిశోధనలు నిరంతరం సాగుతూ ఉంటాయి. అలాగే, రోదసిలో మానవులు నివాస యోగ్యత గురించి ఎప్పటికప్పుడు పరిశీలనలు జరుపుతూ ఉంటారు. భవిష్యత్ లో అంతరిక్షం ఓ ఖరీదైన పర్యాటక కేంద్రంగా మారబోతోంది. ఇప్పటికే చాలా దేశాలు ఆ దిశలో ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ఎప్పటిలానే, ఈ విషయంలో నాసా అందరికంటే ముందుంది. అంతేకాకుండా పలు ప్రయివేట్ సంస్థలు కూడా రోదసిలోకి ప్రయివేట్ వ్యక్తులను తీసుకు వెళ్ళే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాయి. ఇదిలా ఉంటే, అంతరిక్షం నుంచి చూస్తె మన భూమి ఎలా కనిపిస్తుందనే ఆసక్తి చాలా మందికి ఉంటుంది. ఇందుకోసం ఎప్పటికప్పుడు నాసా రోదశి నుంచి భూమిని ఫోటోలు తీసి వాటిని సోషల్ మీడియాలో అందుబాటులో ఉంచుతుంది.

ఎక్కువగా ఇంటర్నెట్ లో విహరించేవారికి తరచూ ఇటువంటి ఫోటోలు కనిపిస్తూనే ఉంటాయి. ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా భూమి ఫోటోలు నాసా నుంచి వచ్చినా ప్రతిసారీ ఆ ఫోటోలు అద్భుతంగానే కనిపిస్తాయి. ఒక్కో ఫోటో ఒక్కో అనుభూతిని పంచుతుంది. ఆ ఫోటోలు చూసిన వారు మంత్రం ముగ్దులవుతారు. నాసాకు చెందిన ఇద్దరు వ్యోమగాములు ఐఎస్ఎస్ లో ఉన్నారు. వారు తాజాగా భూమికి సంబంధించిన కొన్ని ఫోటోలు తీసి పంపించారు. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వాహ్వా అనిపిస్తున్నాయి. అందాల భూమి మరింత అందంగా ఆ చిత్రాలలో కనిపిస్తోంది. మీరూ ఆ చిత్రాలను ఈ ట్వీట్ లలో చూసేయండి.

మొదటి చిత్రాన్ని వ్యోమగామి మార్క్ టి. వందే హే ట్వీట్ చేశారు మరియు ఇది గంభీరమైన హిమాలయాలను చూపిస్తుంది. “హిమాలయాలలో ఎక్కడో ఒక స్పష్టమైన, ప్రకాశవంతమైన రోజు. నేను ఇలాంటి వీక్షణలను పొందలేను ”అని చిత్రాన్ని పంచుకునేటప్పుడు ఆయన శీర్షిక రాశారు. ఆ ట్వీట్ ఇక్కడ చూడండి..

వ్యోమగామి షేన్ కింబ్రో పంచుకున్న మరో చిత్రం, టురిన్ అనే ఇటాలియన్ నగరాన్ని చూపిస్తుంది. “టురిన్, ఇటలీ – ఉత్తర ఇటలీలో గొప్ప చరిత్ర మరియు సంస్కృతి ఉన్న నగరం స్పేస్_స్టేషన్ నుండి గుర్తించడం సులభం,” అని అతను చిత్రంతో పాటు పంచుకున్నాడు. ఆ ట్వీట్ ఇక్కడ చూడొచ్చు..

Also Read: Artificial Sun: అసలు సూర్యుడి కంటె పదిరెట్లు ఎక్కువ వేడి..రికార్డు సృష్టించిన చైనా రెండో సూరీడు

Earth from Space: అంతరిక్షం నుంచి భూమి.. సూర్యుడి తొలి వెలుగులలో భూగోళ సుందర దృశ్యాలు ఇలా ఉంటాయి..