Good News: మందుబాబులకు గుడ్ న్యూస్.. ఇక మద్యం మత్తుకు, దుష్ప్రభావాలకు చెక్!

| Edited By: Balaraju Goud

Jun 15, 2024 | 3:32 PM

మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పారు స్విస్ శాస్త్రవేత్తలు. మద్యం తీసుకోవడం ద్వారా వచ్చే దుష్ప్రభావాలు, మత్తుకు చెక్ పెట్టే విధంగా వినూత్నంగా ప్రోటీన్ జల్‌ను శాస్త్రవేత్తలు రెడీ చేస్తున్నారు. దీని ద్వారా మద్యం ద్వారా వచ్చే అనర్థాలకు, అనారోగ్యాలకు చెక్ పెట్టవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.

Good News: మందుబాబులకు గుడ్ న్యూస్.. ఇక మద్యం మత్తుకు, దుష్ప్రభావాలకు చెక్!
Liqour
Follow us on

మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పారు స్విస్ శాస్త్రవేత్తలు. మద్యం తీసుకోవడం ద్వారా వచ్చే దుష్ప్రభావాలు, మత్తుకు చెక్ పెట్టే విధంగా వినూత్నంగా ప్రోటీన్ జల్‌ను శాస్త్రవేత్తలు రెడీ చేస్తున్నారు. దీని ద్వారా మద్యం ద్వారా వచ్చే అనర్థాలకు, అనారోగ్యాలకు చెక్ పెట్టవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రయోగ స్థాయిలో ఉన్న ఈ జెల్ ఎలకలపై ప్రయోగించారని, అక్కడ సక్సెస్ అవ్వడంతో ఇక మనుషులపై ప్రయోగించాల్సి ఉంటుందంటున్నారు శాస్త్రవేత్తలు.

మద్యం మత్తుకు శరీరంపై పడే దుష్ప్రభావాలకు చెక్ పెట్టే ప్రొటీన్ జల్ ను శాస్త్రవేత్తలు రెడీ చేస్తున్నారు. శరీరంలోకి ప్రవేశించిన మద్యం ప్రమాదకరమైన ఎసిటాల్డి హైడ్ గా మారకముందే దాన్ని మార్చేయడం ఈ జెల్ ప్రత్యేకత. సాధారణంగా మనం తినే ఆహారం జీర్ణవాహికలో నిదానంగా జీర్ణమవుతుంది. కానీ మద్యం నెమ్మదిగా కాకుండా జీర్ణవాహిక గోడలపై ఉండే మ్యూకస్ మెంబ్రేన్ పొరల గుండా రక్తంలోకి ప్రవేశించి రక్త కణాల ద్వారా శరీరమంతా వేగంగా వ్యాప్తిస్తుంది. అందుకే మద్యం తీసుకున్న కొద్దిసేపటికి మత్తు కలగడం మొదలవుతుంది.

అలా రక్తంలోకి చేరిన ఆల్కహాల్ ను మన కాలేయం బ్రేక్ డౌన్ చేసి అసిటాలిటీ హైడ్ గా మారుస్తుంది. అది కొద్దిసేపటికే ఎలాంటి ప్రమాదం లేని అసిటిక్ యాసిడ్ గా మారుతుంది. కానీ అసిటాల్డి హైడ్ మన శరీరానికి తీవ్ర హాని చేస్తుంది. ఈ నేపథ్యంలో జర్మనీకి చెందిన ఈ టి హెచ్ డ్యూరిక్ శాస్త్రవేత్తలు చేసిన ఆలోచన మేరకు శరీరంలోకి ప్రవేశించిన ఆల్కహాల్ రక్తంలోకి ప్రవేశించి ఆపై అసిటాల్డి హైడ్‌గా మారకుండా నేరుగా అసిటిక్ యాసిడ్‌గా మారిపోయేలా చేస్తే మద్యం మత్తును ఇతర దుష్ప్రభావాలను అరికట్టవచ్చు అన్నది వారి ఆలోచన. దీనిపై రకరకాల ప్రయోగాలు చేసి చివరికి వే ప్రోటీన్ లకు ఐరన్, గ్లూకోస్, గోల్డ్ నానో పార్టికల్స్ ను జోడించి ఈ జెల్ ను సిద్ధం చేశారు.

ప్రయోగంలో భాగంగా జెల్ ను రెండు గ్రూపుల ఎలుకలకు ఇచ్చారు. ఒక గ్రూపులో ఎలుకలకు ఒకసారి మద్యం తాగించారు మరో గ్రూపులోని ఎలుకలకు 10రోజుల పాటు మద్యం తాగించారు. ఒక్కసారి మద్యం తాగించిన ఎలకలకు ఈ జల్ ఇచ్చి అరగంట తర్వాత పరీక్ష చేయగా వాటిలో ఆల్కహాల్ స్థాయిలో 40% తగ్గినట్టు గుర్తించారు. ఐదు గంటల తర్వాత పరీక్ష చేయగా మద్యం స్థాయిలు 56% మీద తగ్గాయి. 10 రోజులపాటు వరుసగా ఆల్కహాల్ ఇచ్చిన ఎలుకలకు ఈ జెల్ ఇవ్వగా అది మద్యం వల్ల కలిగే దుష్ప్రభావాలను బాగా తగ్గించినట్లు గమనించారు. ఆ ఎలుకల కాలేయం, ప్లిహం, పేగులు అంతా ఎక్కువగా దెబ్బ తినకుండా ఉండడాన్ని పరిశోధకులు గుర్తించారు.

అయితే ఈ జెల్ ప్రభావం మనుషులపై ఎలా ఉంటుందో పరీక్షించాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మనుషులపై కూడా జెల్ ఇలాగే పనిచేస్తే, ప్రతి సంవత్సరం మద్యపాన వ్యసనం వల్ల సంభవిస్తున్న 30 లక్షల మరణాలకు చెక్ పెట్టవచ్చని ఈటిహెచ్ క్యూరిట్ శాస్త్రజ్ఞులు ఆశాభావం వ్యక్తం చేశారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..