Kitchen Tips: గుడ్లు త్వరగా కుళ్లిపోకుండా ఉండాలా.? ఈ చిట్కా ఫాలో అవ్వండి..

వంటింటిలో కొన్ని సమస్యలు వెంటాడడం సర్వ సాధారణం. కొన్ని చిట్కాలు పాటిస్తే మాత్రం అలాంటి సమస్యలకు సులభంగా చెక్‌ పెట్టొచ్చు. చిన్న చిన్న చిట్కాలతో బెస్ట్‌ రిజల్ట్స్‌ను పొందొచ్చు. అలాంటి వంటించి చిట్కాలు, వాటివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి.? లాంటి విషయాలు మీకోసం..

Kitchen Tips: గుడ్లు త్వరగా కుళ్లిపోకుండా ఉండాలా.? ఈ చిట్కా ఫాలో అవ్వండి..
గుడ్డులోని తెల్లసొన తినడం వల్ల బరువు సులభంగా తగ్గవచ్చు. అంతేకాకుండా, ఈ గుడ్డులోని తెల్ల భాగాన్ని తినడం వల్ల శరీరంలో కొల్లాజెన్ కూడా ఏర్పడుతుంది. ఇందులో ఒక రకమైన అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఏర్పడటానికి సహాయపడుతుంది.

Updated on: Nov 30, 2023 | 8:20 PM

ఇంట్లో వంటింటికి ఉండే ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోటి విద్యలు కూటి కోరకే అన్నట్లు వంటింటికే ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది. అయితే వంటింటిలో కొన్ని సమస్యలు వెంటాడడం సర్వ సాధారణం. కొన్ని చిట్కాలు పాటిస్తే మాత్రం అలాంటి సమస్యలకు సులభంగా చెక్‌ పెట్టొచ్చు. చిన్న చిన్న చిట్కాలతో బెస్ట్‌ రిజల్ట్స్‌ను పొందొచ్చు. అలాంటి వంటించి చిట్కాలు, వాటివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి.? లాంటి విషయాలు మీకోసం..

* సాధారణంగా ఫ్రిజ్‌ లేని వారి కోడి గుడ్లను నిల్వ చేసుకోవడం ఇబ్బందిగా మారుతుంది. కోడిగుడ్లను బయట పెడితే త్వరగా కుళ్లిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్రిజ్‌లేని వారు కోడి గుడ్డు మీద ఆముదం నూనెను రాస్తే త్వరగా కుళ్లిపోవు.

* ఇక కొన్ని సందర్భాల్లో కోడి గుడ్లు పగిలిపోతుంటాయి. ఈ సమస్యకు చెక్‌ పెట్టాలంటే.. గుడ్డుపై నిమ్మరసం రాసి కాసేపు ఆరబెట్టాలి. ఇలా చేస్తే గుడ్డు పగలకుండా ఉంటుంది.

* ఇక ఆమ్లెట్ వేస్తున్న సమయంలో పెనానికి అంటుకోవడం సర్వసాధారణమైన విషయం. అయితే ఇలా అంటుకోకుండా ఉండాలంటే.. పెనం మీద కొంచెం ఉప్పు చల్లితే అంటుకోకుండా బాగా వస్తుంది.

* ఆమ్లెట్‌ రుచికరంగా రావాలంటే గుడ్డు సొనలో కొంచెం.. శనగపిండి, కొబ్బరి కోరు, మసాలాపొడి వేయాలి. ఇలా చేయడం వల్ల ఆమ్లెట్‌కు మరింత రుచి వస్తుంది.

* బిర్యానీ అన్నం గడ్డలుగా కాకుండా పొడిపొడిగా ఉండాలంటే.. బియ్యం ఉడుకుతున్న సయంలో కాస్త నిమ్మకాయ రసం పిండాలి. ఇలా చేస్తే అన్నం విడివిడిగా అవుతుంది.

* టమాట కూర బాగా రుచిగా అవ్వాలంటే.. కూర ఉడికేటప్పుడు చిటికెడు పంచదార వేయాలి. ఇలా వేయడం వల్ల కూరకు రుచి పెరగడంతో పాటు మంచి వాసన వస్తుంది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..